
టీమిండియా వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ ఎట్టకేలకు డెబ్యూ చేయబోతున్నాడు. ఇంగ్లాండ్‌తో రెండో టీ20 కోసం వైభవ్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకున్నారు. దీంతో టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తున్న అతి చిన్న వయస్కుడిగా వైభవ్ చరిత్ర సృష్టించబోతున్నాడు. మ్యాచ్‌కి ముందు జరిగిన టీమ్ హుడిల్‌లో వైభవ్ సూర్యవంశీకి మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ క్యాప్ అందించాడు. దీంతో మిగతా క్రికెటర్లంతా వైభవ్‌ను అభినందనలతో ముంచెత్తారు.
తొలి సారి టీమిండియా తరఫున ఆడుతున్న ఫీలింగ్‌ను వైభవ్ మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేకపోయాడు. అయితే పిల్లాడు కదా పాపం.. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎంత టీమిండియాకు ఆడుతున్నా.. వయసులో చిన్నోడే కనుక ఆ ఎమోషనల్ ఫీలింగ్స్‌ను కన్నీళ్ల రూపంలో చూపించాడు. నిజానికి వైభవ్ కన్నీళ్లు పెట్టుకోవడంతో కొత్త కాదు.. ఐపీఎల్ ఆడుతూ.. పెద్ద స్కోర్లను సెంచరీగా మార్చలేకపోయిన ప్రతీ సారి వైభవ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఇప్పుడు టీమిండియాకు ఆడే అవకాశం వస్తుందనే విషయం తెలిసి మరోసారి చాలా ఎమోషనల్ అయ్యాడు. దేశానికి ప్రతినిధ్యం వహించడం చాలా పెద్ద విషయం అనే సంగతి తెలిసిందే. ఎన్నో లక్షల మంది యువకులు అందుకోసం కలలు కంటుంటారు. కానీ, వైభవ్ దాన్ని కేవలం 15 ఏళ్ల వయసులోనే సాధించాడు. పదో తరగతి చదువుతూ పుస్తకాలతో కుస్తీ పట్టే వయసులోనే 140 కోట్ల మంది భారతీయల ఆశలు మోసే స్థాయికి ఎదిగిపోయాడు. ఫైనల్‌గా.. వైభవ్ సూర్యవంశీకి ఆల్ ది బెస్ట్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి