Video: ఎవ్వరూ ఊహించని రనౌట్.. క్రికెట్‌ చరిత్రలోనే షాకింగ్ వీడియో.. కట్‌చేస్తే.. 9 ఏళ్ల రికార్డ్ బ్రేక్

|

Oct 08, 2024 | 2:34 PM

South Africa Sune Luus Run Out Video: అక్టోబర్ 7 సాయంత్రం జరిగిన మహిళల టీ20 ప్రపంచ కప్ 2024లో దక్షిణాఫ్రికా జట్టు మొదటి ఓటమిని చవిచూసింది. షార్జాలో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు సౌతాఫ్రికాను ఓడించింది. కానీ, ఈ మ్యాచ్‌లో ఒక్కక్షణం నమ్మడం కష్టంగా అనిపించే సన్నివేశం కనిపించింది. క్రికెట్‌లో అసలైన మజా ఈ ఆటలో కనిపించింది. దీంతో 9 ఏళ్ల రికార్డు కూడా బద్దలైంది.

Video: ఎవ్వరూ ఊహించని రనౌట్.. క్రికెట్‌ చరిత్రలోనే షాకింగ్ వీడియో.. కట్‌చేస్తే.. 9 ఏళ్ల రికార్డ్ బ్రేక్
South Africa Sune Luus Run Out
Follow us on

South Africa Sune Luus Run Out Video: అక్టోబర్ 7 సాయంత్రం జరిగిన మహిళల టీ20 ప్రపంచ కప్ 2024లో దక్షిణాఫ్రికా జట్టు మొదటి ఓటమిని చవిచూసింది. షార్జాలో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు సౌతాఫ్రికాను ఓడించింది. కానీ, ఈ మ్యాచ్‌లో ఒక్కక్షణం నమ్మడం కష్టంగా అనిపించే సన్నివేశం కనిపించింది. క్రికెట్‌లో అసలైన మజా ఈ ఆటలో కనిపించింది. షార్జా మైదానంలో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ సునే లూస్‌తో ఇలాంటి ప్రత్యేకమైన సంఘటన జరిగింది. ఇంగ్లాండ్‌కు చెందిన నేట్ సీవర్ ఆమెను రనౌట్ చేసింది.

దక్షిణాఫ్రికా బ్యాటర్ రనౌట్..

నాన్-స్ట్రైక్ ఎండ్‌లో నిలబడిన దక్షిణాఫ్రికా బ్యాటర్‌ను రనౌట్ చేయాలనే ఉద్దేశ్యం నేట్ సీవర్‌కు లేదు. ఆ సమయంలో అకస్మాత్తుగా ఇది జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. వీడియో చాలా షాకింగ్‌గా ఉంది. ఇంతకు ముందు ఆశ్చర్యకరమైన రనౌట్‌లు ఎన్నో వచ్చినా.. ఇలాంటి వీడియో రావడం మొదటిసారి అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.

రనౌట్ అయిన షాకింగ్ వీడియో..

లూస్ ఎలా రనౌట్ అయ్యిందో ఇప్పుడు అర్థం చేసుకుందాం.. నిజానికి ఆమె నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో నిలబడి ఉంది. ఇంగ్లండ్‌కు చెందిన నేట్ సివర్ బౌలింగ్‌లో ఉండగా, సహచర బ్యాటర్ డ్రాక్సన్ స్ట్రైక్‌లో ఉంది. అప్పుడు ఏమి జరిగిందంటే, డ్రాక్సన్ ఒక షాట్ ఆడింది. అది నేరుగా బౌలర్ నేట్ సివర్ షూస్‌కి వెళ్లింది. ఆ బంతి నేరుగా దిశను మార్చుకుని, వికెట్ల వైపు వెళ్లింది. బంతి వికెట్‌ను తాకినప్పుడు, సునే లూస్ క్రీజు వెలుపల ఉంది. దీంతో ఆమె రనౌట్‌గా ప్రకటించారు.

9 ఏళ్ల రికార్డు బద్దలు..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లకు 124 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్‌ 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో షార్జాలో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇదే అతిపెద్ద ఛేజింగ్‌గా నిలిచింది. దీంతో 9 ఏళ్ల రికార్డు కూడా బద్దలైంది. అంతకుముందు 2015లో షార్జాలో పాకిస్థాన్ మహిళల జట్టుపై శ్రీలంక 111 పరుగుల లక్ష్యాన్ని చేధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..