AUS vs SA: ధోనీ నుంచి పాంటింగ్ వరకు.. దిగ్గజాలకే షాకిచ్చిన ప్లేయర్.. కెప్టెన్‌లలో ది బెస్ట్.. ఎవరో, ఎందుకో తెలుసా?

|

Feb 26, 2023 | 8:27 PM

Womens T20 World Cup 2023: ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ ప్రపంచంలోని గొప్ప కెప్టెన్లలో ఒకరు. తన రికార్డ్ బుక్‌లో మరో భారీ రికార్డును చేర్చుకుంది.

1 / 5
టీ20 ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో దక్షినాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో అడుగుపెట్టిన వెంటనే మెగ్ లానింగ్ చాలా ప్రత్యేకమైన సెంచరీ సాధించింది. ఈ సెంచరీ మాత్రం ఆమె బ్యాట్ నుంచి రాలేదు. ఈ సెంచరీ అతని కెప్టెన్సీలో అద్భుతంగా నిలిచింది.

2 / 5
టీ20 ఫార్మాట్‌లో 100 అంతర్జాతీయ మ్యాచ్‌లకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తొలి క్రీడాకారిణిగా మెగ్ లానింగ్ నిలిచింది. పురుషుల క్రికెట్‌లోనూ, మహిళల క్రికెట్‌లోనూ ఆమె ముందు ఈ ఘనత ఎవరూ సాధించలేకపోయారు. కెప్టెన్‌గా ఇప్పటి వరకు ఎవరూ చేయలేని మరో భారీ రికార్డును లానింగ్ తన ఖాతాలో వేసుకుంది.

3 / 5
లానింగ్ ఆస్ట్రేలియా అత్యంత విజయవంతమైన ఆటగాళ్ళలో ఒకరు. ఇప్పటి వరకు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన 99 మ్యాచ్‌ల్లో 75 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 18 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ టై కాగా, ఐదు మ్యాచ్‌ల ఫలితం తేలలేదు. ఆమె గెలుపు శాతం 80.3గా నిలిచింది.

4 / 5
టీ20 ఫార్మాట్‌లో 30కి పైగా అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన 58 మంది ఆటగాళ్లలో, విజయాల శాతం పరంగా లానింగ్ మూడో స్థానంలో నిలిచింది. 2015 నుంచి, లానింగ్ తన కెప్టెన్సీలో అనేక ఐసీసీ ట్రోఫీలకు జట్టును నడిపించింది. ఆమె ఆస్ట్రేలియాకే కాదు ప్రపంచానికే గొప్ప కెప్టెన్లలో ఒకరిగి నిలిచింది.

5 / 5
లానింగ్ తన రికార్డ్ బుక్‌లో మరో పెద్ద రికార్డు సృష్టించే అవకాశం ఉంది. ఆదివారం ఆమె తన జట్టును ప్రపంచ ఛాంపియన్‌గా చేస్తే, కెప్టెన్‌గా అత్యధిక ఐసీసీ ట్రోఫీలు గెలుచుకున్న క్రీడాకారిణి అవుతుంది.