BCCI: వచ్చే ఏడాది నుంచి మహిళల ఐపీఎల్.. భారత్‌పై పాక్ ఫ్యాన్స్ ఫైర్..

|

Oct 19, 2022 | 10:30 AM

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సెక్రటరీ జై షా చేసిన ప్రకటన.. ప్రస్తుతం బీసీసీఐ వర్సెస్‌ పీసీబీగా మారింది.

BCCI: వచ్చే ఏడాది నుంచి మహిళల ఐపీఎల్.. భారత్‌పై పాక్ ఫ్యాన్స్ ఫైర్..
India Womens Cricket Team
Follow us on

ఇటీవల భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సెక్రటరీ జై షా చేసిన ప్రకటన.. ప్రస్తుతం బీసీసీఐ వర్సెస్‌ పీసీబీగా మారింది. ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. అసలు జై షా ఏమన్నారు.? భారత్‌పై పాక్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం దేనికి.?

ఎస్‌..ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ చీఫ్‌ జై షా చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. పాకిస్థాన్‌ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న ఆసియాకప్‌-2023లో భారత్‌ జట్టు పాల్గొనబోదని జై షా ప్రకటన చేశారు..దీంతో షా వ్యాఖ్యలను పాకిస్థాన్ అభిమానులు తప్పుబడుతున్నారు. బీసీసీఐ తన పలుకుబడి చూపిస్తోందని, పాక్‌ క్రికెట్ టీమ్‌ను తొక్కెయ్యాలనుకుంటోందని మండిపడ్డారు. పీసీబీ సైతం ధీటుగా సమాధానం ఇవ్వాలని రమీజ్ రాజాకు సూచిస్తున్నారు. భారత్ వేదికగా జరిగే 2023 వన్డే ప్రపంచకప్‌ను పాక్‌ భాయ్‌కట్ చేయాలంటున్నారు. అప్పుడు బీసీసీఐ, ఐసీసీకి భారీ నష్టం వాటిల్లుతుందని, పాకిస్థాన్ లేకుండా టోర్నీని ఎలా నిర్వహిస్తారో చూద్దామని కామెంట్ చేస్తున్నారు. అయితే కొందరు క్రికెట్ విశ్లేషకులు మాత్రం బీసీసీఐకి వచ్చే నష్టం ఏం లేదని, పీసీబీనే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

ఇక పాకిస్తాన్‌లో ఆడనప్పటికీ- టీమిండియా మాత్రం దాయాది దేశంతో టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఈనెల 23న మ్యాచ్‌ ఆడబోతోంది. ఈ మ్యాచ్‌కి ముందు బీసీసీఐ.. టీమిండియా సభ్యులతో కూడిన ఒక వీడియోను విడుదల చేసింది. We are Team India అంటూ ఈ వీడియోకు క్యాప్షన్‌ కూడా పెట్టింది. ఈ పరిణామాల మధ్యే బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ ఎంపికయ్యారు. బీసీసీఐ అధ్యక్షుడిగా రెండు కీలక విషయాల మీద దృష్టి పెట్టాలనుకుంటున్నాఅన్నారు. అందులో ఒకటి ఆటగాళ్ల గాయాలు.. రెండోది దేశంలోని పిచ్‌ల మీద నేను దృష్టాసారిస్తా అన్నారు. ఇక BCCI ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు గ్రీన్‌ సిగ్నిల్‌ లభించింది. ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహించడానికి జనరల్ బాడీ ఆమోదించిందని BCCI ఒక ప్రకటన విడుదల చేసింది.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..