Asia Cup 2026: ఆసియా కప్‌నకు పాక్ జట్టు ప్రకటన.. భారత్‌తో మ్యాచ్ ఆ రోజే.. పూర్తి వివరాలు ఇవిగో..!

India vs Pakistan Womens Match: సెప్టెంబర్ 5న జరిగే భారత్, పాకిస్థాన్ పోరు ఆసియా కప్‌లోనే అతిపెద్ద ఆకర్షణగా నిలవనుంది. సమతూకంతో కూడిన పాకిస్థాన్ జట్టును ఎదుర్కొని భారత అమ్మాయిలు మరోసారి తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Asia Cup 2026: ఆసియా కప్‌నకు పాక్ జట్టు ప్రకటన.. భారత్‌తో మ్యాచ్ ఆ రోజే.. పూర్తి వివరాలు ఇవిగో..!
India Vs Pakistan Match

Updated on: Aug 17, 2026 | 8:30 AM

India vs Pakistan Womens Match: ఆసియా క్రికెట్ వేదికపై మరో హైవోల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. ప్రతిష్టాత్మక మహిళల టీ20 ఆసియా కప్ 2026 టోర్నీ కోసం పాకిస్థాన్ తమ జట్టును ప్రకటించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరగనున్న ఈ సమరంలో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ తలపడే తేదీ కూడా ఖరారైంది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆ మ్యాచ్ షెడ్యూల్ వివరాలు ఇవే.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఆసియా సమరం..

మహిళల టీ20 ఆసియా కప్ పదో సీజన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 13 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఈ మెగా టోర్నీ అత్యంత ఘనంగా సాగనుంది. ఈ టోర్నీలో మొత్తం 8 ఆసియా దేశాలు పోటీ పడుతున్నాయి. వీటిని చెరో నాలుగు జట్ల చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు.

ఎక్కువమంది చదివినది: IND vs ENG: ప్రపంచ రికార్డ్‌తో వైభవ్ బీభత్సం గుర్తుందా.. బుడ్డోడి ఊచకోతకు బలైన ఇంగ్లాండ్..!

ఇవి కూడా చదవండి

గ్రూప్-ఎ విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, పాకిస్థాన్, థాయిలాండ్, హాంకాంగ్ జట్లు చోటు దక్కించుకున్నాయి. ఈ రెండు చిరకాల ప్రత్యర్థులు ఒకే గ్రూపులో ఉండటంతో లీగ్ దశలోనే దాయాదుల పోరు ఖాయమైంది. ఈ ప్రతిష్టాత్మక సమరానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) తాజాగా 15 మంది సభ్యులతో కూడిన తమ బలమైన మహిళా జట్టును అధికారికంగా ప్రకటించింది.

భారత్ వర్సెస్ పాకిస్థాన్ మహా సమరం ఎప్పుడంటే?

క్రికెట్ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసే దాయాదుల పోరుకు రంగం సిద్ధమైంది. ఈ టోర్నీలో భారత జట్టు తమ ప్రయాణాన్ని ఆగస్టు 30వ తేదీన థాయిలాండ్‌తో జరిగే మ్యాచ్ ద్వారా ప్రారంభిస్తుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 3న హాంకాంగ్ జట్టుతో తలపడుతుంది.

గ్రూప్ దశలో చివరిదైన అత్యంత కీలక పోరులో సెప్టెంబర్ 5న భారత్, పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. మైదానంలో ఇరు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉండటంతో ఈ సమరంపై సర్వత్రా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఫాతిమా సనాకు సారథ్య బాధ్యతలు.. ఏషియన్ గేమ్స్ జట్టు ఎంపిక..

ఆసియా కప్‌తో పాటు జపాన్ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక ఏషియన్ గేమ్స్ 2026 కోసం కూడా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ మహిళా జట్లను ప్రకటించింది. ఈ రెండు భారీ టోర్నీలకు కెప్టెన్‌గా యువ ఆల్‌రౌండర్ ఫాతిమా సనా ఎంపికైంది. గతంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌కు దూరమైన ఆమె, ఇప్పుడు పూర్తి స్థాయి నాయకత్వ బాధ్యతలతో జట్టును ముందుండి నడిపించనుంది.

ఎక్కువమంది చదివినది: 41 సిక్సర్లు, 39 ఫోర్లతో 487 పరుగులు.. భారీ ప్రపంచ రికార్డ్‌తో టీ20 హిస్టరీనే షేక్ చేశారుగా..!

ఏషియన్ గేమ్స్ జట్టులో సీనియర్ బ్యాటర్ అలియా రియాజ్‌కు స్థానం లభించగా, సదాఫ్ షమాస్, సిద్రా అమీన్‌లను సెలెక్టర్లు పక్కన పెట్టారు. జపాన్‌లో జరిగే ఏషియన్ గేమ్స్ పోటీల్లో పాకిస్థాన్ జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టనుంది. సెప్టెంబర్ 17న థాయిలాండ్‌తో క్వార్టర్ ఫైనల్ పోరులో తలపడనుండగా, సెప్టెంబర్ 20న సెమీఫైనల్, సెప్టెంబర్ 22న స్వర్ణ పతక పోరు జరగనుంది.

ఆసియా కప్, ఏషియన్ గేమ్స్ బరిలో దిగే పాక్ జట్లు..

ఆసియా కప్ టోర్నీ కోసం ప్రకటించిన పాకిస్థాన్ జట్టులో మునీబా అలీ సిద్దిఖీ వికెట్ కీపర్‌గా వ్యవహరించనుంది. అయేషా జాఫర్, ఇమాన్ నసీర్, ఏమాన్ ఫాతిమా, గుల్ ఫిరోజా, మోమినా రియాసత్, నజీహా అల్వీ, నష్రా సంధు, సాదియా ఇక్బాల్, సైరా జబీన్, షావాల్ జుల్ఫికర్, తుబా హసన్, ఉమ్మె హానీ, వహీదా అక్తర్ ప్రధాన జట్టులో స్థానం సంపాదించారు. స్టాండ్‌బై ఆటగాళ్లుగా తస్మియా రుబాబ్, హుమ్నా బిలాల్, మహమ్ అనీస్, సదఫ్ షమాస్‌లను ఎంపిక చేశారు.

ఏషియన్ గేమ్స్ జట్టులోనూ దాదాపు వీరే కొనసాగుతుండగా, సీనియర్ బ్యాటర్ అలియా రియాజ్ అదనపు బలంగా చేరింది. రిజర్వ్ విభాగంలో నతాలియా పర్వేజ్, రమీన్ షమీమ్ వంటి క్రీడాకారిణులకు అవకాశం కల్పించారు. సరికొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతున్న పాక్ మహిళల జట్టు భారత మహిళా జట్టుకు ఏ మేరకు పోటీనిస్తుందో వేచి చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us