Cricket: ఈ దూకుడేందయ్యా సామీ.. 48 బంతుల్లోనే 108 రన్స్..10 ఫోర్లు, 8 సిక్స్‌లతో లీగ్‌లోనే ఫాస్టెస్ట్ సెంచరీ
The Hundred League 2022: ఇంగ్లండ్ వేదికగా జరగుతోన్న ద హండ్రెడ్ లీగ్ 2022 క్రికెట్ టోర్నమెంట్ లో పరుగుల వరద పారుతోంది. బ్యాటర్లు మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు.
The Hundred League 2022: ఇంగ్లండ్ వేదికగా జరగుతోన్న ద హండ్రెడ్ లీగ్ 2022 క్రికెట్ టోర్నమెంట్ లో పరుగుల వరద పారుతోంది. బ్యాటర్లు మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. రెండు రోజుల క్రితం బర్మింగ్‌హామ్ ఫీనిక్స్‌కు చెందిన 20 ఏళ్ల బ్యాటర్ విల్ స్మీడ్ 50 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో శతక్కొట్టాడు. తద్వారా ఈ లీగ్‌లో మొదటి సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. తాజాగా ఓవల్ ఇన్విన్సిబుల్స్‌కు చెందిన 23 ఏళ్ల విల్‌జాక్స్ ఏకంగా 47 బంతుల్లోనే మూడంకెల స్కోరు అందుకున్నాడు. మొత్తం 48 బంతుల్లో 10 ఫోర్లు, 8 భారీ సిక్సర్ల సాయంతో 108 పరుగులతో అజేయంగా నిలిచి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. కాగా విల్‌స్మీడ్ సెంచరీ సాధించిన సథరన్ బ్రేవ్‌పైనే జాక్స్ కూడా సెంచరీ బాదడం విశేషం.