ZIM vs SA Test:నిన్న బుమ్రా జస్ట్ మిస్.. నేడు కెప్టెన్‌గా తొలి టెస్టులోనే ట్రిపుల్ సెంచరీ చేసిన సౌతాఫ్రికా ప్లేయర్

జింబాబ్వేతో జరుగుతున్న టెస్టులో కెప్టెన్‌గా తన తొలి టెస్టులోనే వయాన్ ముల్డర్ ట్రిపుల్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. రెండో అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ, హాషిమ్ ఆమ్లా రికార్డు బద్దలు చేశాడు. రీసెంటుగా శుభమాన్ గిల్ కూడా 269 పరుగులు చేసి ట్రిపుల్ సెంచరీ మిస్ అయ్యాడు.

ZIM vs SA Test:నిన్న బుమ్రా జస్ట్ మిస్.. నేడు కెప్టెన్‌గా తొలి టెస్టులోనే ట్రిపుల్ సెంచరీ చేసిన సౌతాఫ్రికా ప్లేయర్
Wiaan Mulder

Updated on: Jul 07, 2025 | 4:18 PM

ZIM vs SA Test: జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో సౌతాఫ్రికా ప్లేయర్ వయాన్ ముల్డర్ ట్రిపుల్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. సోమవారం టెస్టు రెండో రోజు 297 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసిన ముల్డర్, టెస్ట్ క్రికెట్ చరిత్రలో రెండో అత్యంత ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ నమోదు చేశారు. అంతేకాకుండా, సౌతాఫ్రికా తరపున ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా కూడా తను నిలిచాడు.

వయాన్ ముల్డర్ ప్రపంచంలోనే ఇలాంటి రికార్డు సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. కెప్టెన్‌గా తన తొలి టెస్టు మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక ప్లేయర్ అతను. ప్రస్తుత కెప్టెన్ తెంబా బావుమా జింబాబ్వేతో జరుగుతున్న ఈ సిరీస్‌కు అందుబాటులో లేడు. అతను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో గాయపడ్డారు.తన ప్లేసులో కేశవ్ మహారాజ్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. అయితే అతను కూడా గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యారు. మహారాజ్ స్థానంలో రెండో టెస్టులో వయాన్ ముల్డర్ జట్టు పగ్గాలు చేపట్టారు. కెప్టెన్‌గా తన తొలి ఇన్నింగ్స్‌లోనే ఈ రికార్డును సాధించడం విశేషం.

ఇది టెస్ట్ చరిత్రలో రెండో అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ. మొదటి స్థానంలో భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నాడు. సెహ్వాగ్ 2008లో దక్షిణాఫ్రికాపై 278 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. వయాన్ ముల్డర్ అతని రికార్డుకు చాలా దగ్గరగా వచ్చాడు. 297 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించి ముల్డర్ రెండో స్థానానికి చేరుకోగా, అంతకుముందు ఈ స్థానంలో హ్యారీ బ్రూక్ ఉండేవాడు. అతను గతేడాది పాకిస్తాన్‌పై 310 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ చేశాడు.

వయాన్ ముల్డర్ సౌతాఫ్రికా తరపున టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా కూడా నిలిచాడు. అతను 13ఏళ్ల క్రితం హాషిమ్ ఆమ్లా నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. 2012లో ఆమ్లా 311 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా తరపున అత్యధిక పరుగుల ఇన్నింగ్స్ ఆడింది అతనే, కానీ ముల్డర్ ఆ రికార్డును అధిగమించాడు. ప్రస్తుతం ముల్డర్ 362 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. బ్రియాన్ లారా రికార్డును కూడా బద్దలు కొట్టే దిశగా ఉన్నారు. టెస్ట్ క్రికెట్ ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్ లారా. తను 2004లో ఇంగ్లాండ్‌పై అజేయంగా 400 పరుగులు చేశాడు.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ చేయండి..