
టీ20 ప్రపంచకప్ 2026 కోసం బీసీసీఐ అధికారికంగా జట్టును ప్రకటించింది. రింకూ సింగ్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్స్ తిరిగి జట్టులోకి రాగా.. అనూహ్యంగా శుభ్‌మాన్ గిల్‌ను జట్టును నుంచి వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించి, ఆ స్థానంలో అక్షర్ పటేల్‌ను కొత్త వైస్ కెప్టెన్‌గా నియమించారు. టీ20ల్లో గిల్ ఇటీవలి ఫామ్‌పై సెలెక్టర్ల అసంతృప్తిగా ఉన్నందుకే ఈ వేటు అని కొందరు అంటుంటే.. టాప్‌లో వికెట్ కీపర్ అవసరమొచ్చాడు అందుకే సంజూ శాంసన్ జట్టులో ఉన్నాడని అగార్కర్ చెప్పుకొచ్చాడు. అయితే గిల్ వేటు వెనుక కొన్ని వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని తెలుస్తోంది.
గిల్‌ను దూరం పెట్టడం వెనుక అసలు కారణం.. టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు జరిగే వేదికలు, పిచ్‌ల స్వభావమేనట. భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న ఈ మెగా టోర్నీలో భారత్ తన ప్రతీ మ్యాచ్‌ను వేర్వేరు వేదికలపై ఆడనుంది. టోర్నమెంట్ ముందుకు సాగేకొద్దీ పిచ్‌లు స్లోగా మారొచ్చు. ఆ పరిస్థితుల్లో, మ్యాచ్ ఫలితాన్ని మార్చడానికి పవర్ ప్లే చాలా ముఖ్యం. గిల్ ప్రస్తుత ఫామ్, అతడు ఆడే కొన్ని పిచ్‌లను పరిశీలినలోకి తీసుకుని సెలెక్టర్లు అతడ్ని పక్కన పెట్టారు. దీంతో గిల్ స్థానంలో సంజూ శాంసన్ జట్టులోకి వచ్చాడు. సంజూతో పాటు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ దూకుడైన ఆటతీరును కనబరుస్తారు.
ఇక అగార్కర్ చెప్పిన విషయానికొస్తే.. జట్టు కాంబినేషన్ల కారణంగానే గిల్ తన స్థానాన్ని కోల్పోయాడని అతడు పేర్కొన్నాడు. 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసేటప్పుడు, ఎవరో ఒకరు జట్టులో స్థానం కోల్పోవాల్సి వస్తుందని, దురదృష్టవశాత్తు అది గిల్ అని తెలిపాడు. ఇన్ని చెప్పినా గిల్ మంచి ఆటగాడని వెనకేసుకుని వచ్చాడు. మరోవైపు, జట్టులో ఫినిషర్ రోల్ విషయంలో హార్దిక్ పాండ్యా కీలకం కానున్నాడు. అటు అతడికి తోడుగా రింకూ సింగ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించే ఈ టోర్నీలో పాకిస్తాన్, శ్రీలంక మ్యాచ్‌లు శ్రీలంక వేదికగా జరుగుతాయి. మిగిలిన అన్ని మ్యాచ్‌లు భారత్‌లోనే ఉంటాయి. ఫిబ్రవరి 15న శ్రీలంకలో భారత్, పాక్ మధ్య హై టెన్షన్ మ్యాచ్ జరగనుంది.