Mumbai Indians vs Royal Challengers Bangalore: ఒకవైపు హడలెత్తిస్తున్న కరోనా.. మరోవైపు ఠారేత్తిస్తున్న ఎండలు.. ఈ రెండింటి మధ్య క్రీడా అభిమానులకు వినోదాన్ని పంచేందుకు (ఐపీఎల్) వచ్చేసింది. నేటి నుంచి చెన్నై వేదికగా ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనున్నాయి. చెపాక్ స్టేడియం స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ కావడంతో ప్లేయింగ్ ఎలెవన్‌పై రెండు టీమ్స్ ప్రత్యేక శ్రద్ధ వహించాయి.
రెండూ బలమైన జట్లే. హార్డ్ హిట్టర్స్ కూడా ఉన్నారు. ముంబై ఇండియన్స్‌కు ఓపెనింగ్ కాస్త సమస్యగా ఏర్పడింది. రెగ్యులర్ ఓపెనర్ క్వింటన్ డికాక్ క్వారంటైన్ ఇంకా ముగింపుకు రాకపోవడంతో.. ఇషాన్ కిషన్, కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఇక అటు ఆర్సీబీ ఓపెనర్ దేవదూత్ పడిక్కల్ కరోనా నుంచి కోలుకోవడం.. ఆ జట్టుకు బలం చేకూర్చింది. ఇప్పటిదాకా 27 సందర్భాల్లో ఇరు జట్లూ తలపడగా.. ముంబై 17 సార్లు, ఆర్సీబీ 9 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించాయి. ఇక మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
(Who Will Win Today IPL Match)
ఐపీఎల్‌లో ఆర్సీబీ తరపున విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. అతడికి యువ ఆటగాడు పడిక్కల్ ఓపెనింగ్ పార్టనర్. ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ స్పిన్‌కు వ్యతిరేకంగా ఉన్న స్ట్రైక్ రేట్ క్రమేపీ పడిపోతోందని చెప్పవచ్చు. 2015లో 147.90గా ఉన్న స్ట్రైక్ రేట్.. ఆ తర్వాత 2018 సీజన్‌కు 117.97గా నమోదైంది. అయితే డెత్ ఓవర్‌లలో 225 స్ట్రైక్ రేట్‌తో పరుగులు రాబట్టగలిగిన ఏబీ డివిలియర్స్ రాయల్ ఛాలెంజర్స్ టీమ్‌లో ఉండటం ఆర్సీబీకి ప్రధాన బలం. అంతేకాకుండా ఇప్పుడు నెంబర్ 4 స్థానంలో మ్యాక్స్‌వెల్ కూడా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతే.. పరుగుల వరద ఖాయమని చెప్పొచ్చు. ఆర్సీబీ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది.
క్వారంటైన్ కారణంగా క్వింటన్ డికాక్ ఈ మ్యాచ్ ఆడకపోతే.. ఓపెనింగ్‌లో రోహిత్ శర్మ పార్టనర్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ కావచ్చు. ఇక ముంబై మిడిల్ ఆర్డర్ గురించి చెప్పనక్కర్లేదు. సూర్యకుమార్ యాదవ్, పొలార్డ్, పాండ్యా బ్రదర్స్‌తో స్ట్రాంగ్‌గా ఉంది. బౌలింగ్‌లో ముగ్గురు స్పెషలిస్ట్ బౌలర్లు ఉండొచ్చు.
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కైరాన్ పొలార్డ్, జేమ్స్ నీషామ్, క్రునాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్ నైలు, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా
విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవదూత్ పడిక్కల్, ఏబీ డివిలియర్స్, గ్లెన్ మాక్స్‌వెల్, మహ్మద్ అజారుద్దీన్ (వికెట్ కీపర్), డేనియల్ క్రిస్టియన్, వాషింగ్టన్ సుందర్, కైల్ జామిసన్, నవదీప్ సైనీ, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్
‘జగనన్న స్మార్ట్ టౌన్’.. దరఖాస్తు చేసుకోండిలా.. అర్హతలు ఇవే.!
ఈ ఫోటోలోని ఇద్దరు హీరోయిన్స్‌ను గుర్తు పట్టారా.? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పిక్.!
ఇంటి గుమ్మంలో తిష్టవేసిన సింహాలు.. డోర్ తీసి కంగుతిన్న యజమాని.. కట్ చేస్తే ఊహించని సంఘటన.!