Asia Cup 2025 : ఆసియా కప్ వరకు సూర్యకుమార్ ఫిట్‎గా లేకపోతే పరిస్థితి ఏంటి.. ఎవరు కెప్టెన్ అవుతారు ?

ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యుఏఈలో జరగనుంది. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14న భారత్-పాకిస్థాన్ మ్యాచ్, సెప్టెంబర్ 19న ఒమన్‌తో గ్రూప్ స్టేజ్ చివరి మ్యాచ్ జరగనున్నాయి.

Asia Cup 2025 : ఆసియా కప్ వరకు సూర్యకుమార్ ఫిట్‎గా లేకపోతే పరిస్థితి ఏంటి.. ఎవరు కెప్టెన్ అవుతారు ?
Team India

Updated on: Aug 10, 2025 | 3:16 PM

Asia Cup 2025 : ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలో జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో భారత్ తమ మొదటి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. ఈ టోర్నీకి టీ20 కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్‌కు ఇటీవల సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన ఫిట్‌నెస్ సాధించడానికి కృషి చేస్తున్నారు. ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ ఆసియా కప్‌కు ఫిట్ కాకపోతే టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు ఎవరు చేపడతారు? అనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

సూర్యకుమార్ యాదవ్ ఇటీవలే జర్మనీలో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ కోసం రిహాబిలిటేషన్ తీసుకుంటున్నారు. ఆసియా కప్ నాటికి అతను పూర్తిగా ఫిట్ అవుతాడని భావిస్తున్నారు. ఒకవేళ ఆయన ఫిట్ కాకపోతే, కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి ముగ్గురు ఆటగాళ్లు ప్రధాన పోటీలో ఉన్నారు.

1. శుభ్‌మన్ గిల్

ఇంగ్లండ్ పర్యటనలో తొలిసారి టెస్టుల్లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి అందరి ప్రశంసలు అందుకున్నారు. బ్యాటింగ్‌లోనూ పలు రికార్డులు సృష్టించారు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు గిల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. అందుకే, సూర్య అందుబాటులో లేకపోతే గిల్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ టీ20 కెరీర్ విషయానికి వస్తే మొత్తం 5మ్యాచులకు కెప్టెన్ గా వ్యవహరించాడు. వాటిలో భారత్ నాలుగు మ్యాచులు గెలిచింది. ఒకదాంట్లో ఓడిపోయింది.

2. హార్దిక్ పాండ్యా

ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ టీమిండియాకు కీలక పాత్ర పోషిస్తారు. ఆయన సారథ్యంలో గుజరాత్ టైటాన్స్ మొదటి సీజన్‌లోనే ఛాంపియన్‌గా నిలిచింది. రెండో సీజన్‌లో ఫైనల్‌కు చేరింది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా, ఈ సీజన్‌లో జట్టును క్వాలిఫైయర్-2 వరకు తీసుకెళ్లారు. కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా టీ20I కెరీర్ విషయానికి వస్తే మొత్తం 16మ్యాచులు ఆడాడు. అందులో భారత్ 16గెలిచింది. 5మ్యాచుల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ టై అయింది.

3. అక్షర్ పటేల్

ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కూడా ఈ పోటీలో ఉన్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అతన్ని వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. బ్యాటింగ్, బౌలింగ్‌లోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ అద్భుతంగా రాణిస్తారు. అయితే, ఆయన ఇంకా భారత జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించలేదు.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..