AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డ్రైయర్ నుంచి రైస్ కుక్కర్ వరకు.. క్రికెటర్లకు విచిత్ర గిఫ్ట్‌లు.. లిస్ట్‌లో టీమిండియా కూడా..!

Bizarre Cricket Prizes: మైదానంలో రికార్డులు సృష్టించే ఆటగాళ్లకు ఇలాంటి ఊహించని బహుమతులు దక్కడం అటు క్రీడాకారులతో పాటు అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. సాంప్రదాయ కప్పులు, షీల్డుల కంటే కూడా ఇలాంటి వినూత్న జ్ఞాపకాలు క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.

డ్రైయర్ నుంచి రైస్ కుక్కర్ వరకు.. క్రికెటర్లకు విచిత్ర గిఫ్ట్‌లు.. లిస్ట్‌లో టీమిండియా కూడా..!
Bizarre Cricket Prizes
Venkata Chari
|

Updated on: Aug 21, 2026 | 6:12 PM

Share

Bizarre Cricket Prizes: క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ట్రోఫీలు, నగదు బహుమతులు రావడం సాధారణం. కొన్నిసార్లు ఊహించని వింత కానుకలు వారి చేతుల్లోకి వస్తుంటాయి. మ్యాచ్ బంతిని చెరిసగం చేసుకోవడం మొదలుకొని మిక్సీలు, అమెరికాలో భూమి వరకు క్రికెట్ చరిత్రలో ఆటగాళ్లకు దక్కిన అత్యంత విచిత్రమైన జ్ఞాపికల వెనుక ఉన్న అసలు కథలేంటో తెలుసుకుందాం..

లీడ్స్ టెస్టులో వినూత్న ఆలోచన.. బంతిని కోసి పంచుకున్న బౌలర్లు..

పాకిస్థాన్‌తో లీడ్స్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పేసర్లు ఆలీ రాబిన్సన్, జోష్ టంగ్ నిప్పులు చెరిగే బంతులతో చెలరేగిపోయారు. ఇద్దరూ చెరో 5 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కేవలం 171 పరుగులకే ఆలౌట్ చేశారు. సాధారణంగా ఐదు వికెట్లు తీసిన బౌలర్ ఆ మ్యాచ్ బంతిని జ్ఞాపకంగా తనతో తీసుకెళ్లడం ఆనవాయితీ. ఇద్దరు బౌలర్లూ సమానంగా చెలరేగడంతో ఒకే బంతి కోసం పోటీ పడకుండా, దానిని సరిగ్గా రెండు భాగాలుగా కత్తిరించి చెరి సగం పంచుకున్నారు. ఇలాంటి అరుదైన ఫీట్ మళ్లీ రాకపోవచ్చని, అందుకే ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నామని రాబిన్సన్ పేర్కొన్నారు. క్రికెట్ మైదానాల్లో ఇలాంటి వింత బహుమతులు కనిపించడం ఇదే మొదటిసారి కాదు.

ఇవి కూడా చదవండి

ఎక్కువమంది చదివినది: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 2027 వన్డే ప్రపంచకప్ జట్టులో వైభవ్‌కు చోటు.. ఓపెనర్లుగా ఎవరంటే?

వంటింటి సామాన్ల నుంచి మినీ ట్రక్కు దాకా..

గతంలో బంగ్లాదేశ్ దేశవాళీ టోర్నీ అయిన ఢాకా ప్రీమియర్ లీగ్‌లో ఇంగ్లాండ్ మాజీ సారథి ఇయాన్ మోర్గాన్ ఒత్తిడిని అధిగమించి 86 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. ఆ మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శనకు గాను ఆయనకు ఒక ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్ బహుమతిగా ఇచ్చారు. అదే లీగ్‌లో ఆల్‌రౌండ్ షోతో 66 పరుగులు, 3 వికెట్లు తీసిన ల్యూక్ రైట్ చేతికి బ్లెండర్ ఇచ్చి సత్కరించారు.

2017లో శ్రీలంక పర్యటనలో 15 వికెట్లతో సత్తా చాటిన భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా ఏకంగా ఒక మినీ ట్రక్కు దక్కింది. మైదానంలో ఆ వాహనాన్ని ఎంఎస్ ధోని డ్రైవ్ చేస్తూ సహచర ఆటగాళ్లతో కలిసి సరదాగా విక్టరీ ల్యాప్ కొట్టిన దృశ్యాలు అభిమానులకు ఎప్పటికీ గుర్తే.

ఎక్కువమంది చదివినది:SL vs IND: లంకపై ఘన విజయం.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో భారత్ దూకుడు.. ఆ జట్టు ఔట్..?

సైకిల్, డ్రైయర్.. ఏకంగా అమెరికాలో భూమి..

పాకిస్థాన్ సూపర్ లీగ్ 2025 సీజన్‌లో కరాచీ కింగ్స్ బ్యాటర్ జేమ్స్ విన్స్ 43 బంతుల్లోనే 101 పరుగులు చేసి మెరుపు సెంచరీ సాధించారు. డ్రెస్సింగ్ రూమ్ స్పాన్సర్ అవార్డు కింద ఆయనకు హెయిర్ డ్రైయర్ లభించింది. దీనిపై ఆయన సోషల్ మీడియాలో సరదాగా స్పందించారు. 2026 ఐఎల్‌టీ20లో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా ఘజన్‌ఫర్ పట్టిన అద్భుత క్యాచ్‌కు నిర్వాహకులు రేసింగ్ సైకిల్ బహూకరించారు.

వీటన్నింటినీ మించి గ్లోబల్ టీ20 కెనడా 2023 టోర్నీలో మాంట్రియల్ టైగర్స్ తరఫున అదరగొట్టిన వెస్టిండీస్ ఆటగాడు షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా ఎంపికయ్యారు. ఆయనకు ఏకంగా అమెరికాలో అర ఎకరం భూమిని బహుమతిగా ఇవ్వడం అప్పట్లో పెను సంచలనమైంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..