Virat Kohli: చరిత్ర సృష్టించేందుకు అడుగుదూరంలో కోహ్లీ! ఇండియన్‌ క్రికెట్‌ హిస్టరీలోనే ఫస్ట్‌ ప్లేయర్‌ అవుతాడు..

విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో 250వ మ్యాచ్ ఆడేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇప్పటి వరకు 8004 పరుగులు, 8 శతకాలు, 55 అర్ధ శతకాలు సాధించాడు. టీ20 క్రికెట్‌లో మరో సెంచరీ సాధిస్తే బాబర్ అజామ్ తో సమానం చేస్తాడు. భారత తరఫున 10 శతకాలు సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025లో కోహ్లీ ప్రదర్శనపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Virat Kohli: చరిత్ర సృష్టించేందుకు అడుగుదూరంలో కోహ్లీ! ఇండియన్‌ క్రికెట్‌ హిస్టరీలోనే ఫస్ట్‌ ప్లేయర్‌ అవుతాడు..
అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ. 2008, 2024 మధ్య, అతను 252 మ్యాచ్‌లలో 250 ఇన్నింగ్స్‌లలో గరిష్టంగా 114 క్యాచ్‌లు పట్టాడు.

Updated on: Mar 13, 2025 | 9:02 PM

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముగిసింది. టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. ఇక ఇప్పుడు అందరి కళ్లు ఐపీఎల్ 2025పైనే ఉన్నాయి. మరో 8 రోజుల్లో ఈ మెగా లీగ్ ప్రారంభం కానుంది. దీని కోసం క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఐపీఎల్ హిస్టరీలో గ్రేటెస్ట్ బ్యాటర్స్ లో ఒకరైన విరాట్ కోహ్లీకి ఈ సీజన్ లో ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. అదేంటంటే.. విరాట్ కోహ్లీ కెరీర్ లో 250 ఐపీఎల్ మ్యాచులు ఆడి 8,004 పరుగులు చేశాడు. అందులో 8 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత 17 ఏళ్లగా ఒకే ఫ్రాంఛైజీకి ప్రాతినిథ్యం వహిస్తూ నిలకడగా రాణిస్తున్నాడు.

ఇప్పుడు అతడు 18వ సీజన్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో టీ20 క్రికెట్ లో చరిత్ర సృష్టించడానికి కేవలం ఒక్క సెంచరీ దూరంలోనే ఉన్నాడు కింగ్‌ కోహ్లీ. ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక సెంచరీల నమోదు చేసిన ఆటగాడిగా కోహ్లీ కొనసాగుతున్నాడు. అందులో 8 ఐపీఎల్ లో బాదగా.. ఒకటి అంతర్జాతీయ సెంచరీ. ఆ అంతర్జాతీయ శతకాన్ని 2022లో టీ20 ఆసియా కప్ లో అప్ఘానిస్థాన్ పై సాధించాడు. ఓవరాల్ గా అత్యధిక టీ20 సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్ గేల్ (22) అగ్రస్థానంలో నిలిచాడు.

ఆ తర్వాత పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ అజామ్ 11 సెంచరీలతో రెండు ప్లేస్లో ఉండగా, విరాట్ 9 సెంచరీలతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు కోహ్లీ ఐపీఎల్ లో మరో సెంచరీ బాదితే టీ20 క్రికెట్ లో బాబర్ అజామ్ తో కలిసి అత్యధిక సెంచరీల రికార్డును సమం చేసినట్టువుతుంది. అలాగే భారత్ తరఫున 10 సెంచరీలు బాదిన తొలి ప్లేయర్ గా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. ప్రస్తుతం కోహ్లీ ఎలాగో మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. ఐపీఎల్‌లోనూ అదే ఫామ్‌ను కనబర్చిస్తే.. కచ్చితంగా ఒక సెంచరీ చేస్తాడని క్రికెట్‌ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆర్సీబీ తమ ఫస్ట్‌ మ్యాచ్‌ను ఈ నెల 22న ఆడనుంది. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కేకేఆర్‌తో ఆర్సీబీ ఫస్ట్‌ మ్యాచ్‌లోనే తలపడనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..