IPL 2023: ధోని వద్దన్నాడు.. విరాట్ రమ్మంటున్నాడు.. ఆ ప్లేయర్‌పైనే ఆర్‌సీబీ గురి.. కొడితే జాక్‌పాటే!

|

Dec 22, 2022 | 8:11 AM

వచ్చే సీజన్‌లో ఐపీఎల్ ట్రోఫీనే టార్గెట్‌గా చెన్నై సూపర్ కింగ్స్ మినీ వేలానికి ముందు పలు మార్పులు చేసిన సంగతి తెలిసిందే.

IPL 2023: ధోని వద్దన్నాడు.. విరాట్ రమ్మంటున్నాడు.. ఆ ప్లేయర్‌పైనే ఆర్‌సీబీ గురి.. కొడితే జాక్‌పాటే!
Virat Kohli
Follow us on

వచ్చే సీజన్‌లో ఐపీఎల్ ట్రోఫీనే టార్గెట్‌గా చెన్నై సూపర్ కింగ్స్ మినీ వేలానికి ముందు పలు మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ ఫ్రాంచైజీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ నారాయణ్ జగదీషన్‌కు మొండిచెయ్యి చూపించింది. ఇలా సీఎస్‌కే విడుదల చేసిందో.. లేదో.. ఈ కుడి చేతివాటం ప్లేయర్ అలా దంచికొట్టాడు. విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతమైన ఫామ్ కనబరిచి తన సత్తాను చాటుకున్నాడు.

వరుసపెట్టి సెంచరీలు సాధించడమే కాదు.. డబుల్ సెంచరీ కొట్టి ఏకంగా వరల్డ్ రికార్డు సృష్టించాడు. విజయ్ హజారే ట్రోఫీలో మొత్తంగా 8 మ్యాచ్‌లలో జగదీషన్ 830 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ ప్రదర్శన అతడికి మినీ వేలంలో జాక్‌పాట్ తగిలే ఛాన్స్ ఇవ్వనుంది. రెండు జట్లు అతడి కోసం పోటీ పడుతుండగా.. అందులో ఓ టీం మాత్రం జగదీషన్‌పై కాసుల వర్షం కురిపించేందుకు సిద్దం అవుతోంది.

కాగా, మరికొద్ది గంటల్లో ఐపీఎల్ 2023 మినీ వేలం జరగనుంది. తన విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో మినీ వేలంలో నారాయణ్ జగదీషన్ స్టార్ ఎట్రాక్షన్‌గా నిలవనున్నాడు. ఇతడ్ని వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టార్గెట్ చేయనున్నట్లు తెలుస్తోంది. మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం కావడంతో పాటు వికెట్ కీపింగ్‌ ఆప్షన్‌కు జగదీషన్ సరిగ్గా సరిపోతాడని బెంగళూరు ఫ్రాంచైజీ భావిస్తోందట.