
Virat Kohli : టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఆదివారం లండన్ వీధుల్లో సరదాగా తిరుగుతూ కనిపించారు. సాధారణ దుస్తుల్లో ఉన్న ఈ జంట, ఇండియాలో వారికి ఉండే భారీ సెక్యూరిటీ, అభిమానుల కోలాహలం లేకుండా చాలా ప్రశాంతంగా కనిపించింది. వారు అక్కడ స్థానికులతో నవ్వుతూ, సరదాగా మాట్లాడుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఇద్దరూ ఇండియాలో అయితే అభిమానుల మధ్య అస్సలు స్వేచ్ఛగా తిరగలేరు. కానీ, లండన్‌లో వారిద్దరూ చాలా ప్రశాంతంగా ఏ ఫాన్‌ఫేర్ లేకుండా తిరుగుతూ కనిపించారు. ఒక స్థానిక వ్యక్తితో మాట్లాడుతుండగా కోహ్లీ నవ్వుతూ సరదాగా మాట్లాడుతున్న వీడియో అభిమానుల మనసులను తాకింది. చాలామంది అభిమానులు, ఇదే నిజమైన ప్రశాంతత అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మాధురీ దీక్షిత్ భర్త, డాక్టర్ శ్రీరామ్ నేనే గతంలో ఒక యూట్యూబ్ షోలో మాట్లాడుతూ.. అనుష్క శర్మ లండన్‌కు మకాం మార్చడం వెనుక ఉన్న కారణాన్ని వివరించారు. “వారు తమ పిల్లలను ఒక సాధారణ వాతావరణంలో పెంచాలని అనుకుంటున్నారు. ఇక్కడ వారి విజయాన్ని వారు ఆస్వాదించలేకపోతున్నారు. వారు ఏ చిన్న పని చేసినా మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. దాంతో వారు ఒంటరిగా ఉన్నట్లు భావిస్తున్నారు” అని శ్రీరామ్ నేనే చెప్పారు.ః
VIRAT KOHLI & ANUSHKA SHARMA AT THE LONDON STREETS. ❤️
— Tanuj (@ImTanujSingh) August 17, 2025
VIRAT KOHLI & ANUSHKA SHARMA AT THE LONDON STREETS. ❤️
— Tanuj (@ImTanujSingh) August 17, 2025
విరాట్ కోహ్లీ మే నెలలో టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి కేవలం వన్డే ఫార్మాట్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. దీంతో అతని భవిష్యత్తుపై చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ కోహ్లీకి చివరి అంతర్జాతీయ సిరీస్ కావచ్చని కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. అయితే, ఆ తర్వాత కూడా 2027 వన్డే ప్రపంచ కప్‌లో ఆడతాడని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కానీ, కోహ్లీ ఇటీవల ఆస్ట్రేలియా సిరీస్‌కు సిద్ధమవుతున్నట్లు సూచించిన ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను లైక్ చేయడం ద్వారా అన్ని ఊహాగానాలకు ముగింపు పలికాడు.
కోహ్లీ చివరిసారిగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు తరఫున ఆడాడు. ఆ టోర్నమెంట్‌లో భారత్ విజయంలో అతను కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడి, తమ జట్టును విజేతగా నిలిపాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..