Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి టీమిండియా తలుపులు మూసుకుపోయాయా? కెప్టెన్ సంచలన ప్రకటన

Vaibhav Sooryavanshi: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు వైభవ్ సూర్యవంశీ ప్లేయింగ్‌ ఎలెవన్ అవకాశాలపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఫాంలో ఉండి స్థిరంగా పరుగులు సాధిస్తున్నారు. ఈ సమయంలో ఆ ఓపెనింగ్ జోడిని మార్చలేమని శ్రేయస్ అయ్యర్ అన్నారు.

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి టీమిండియా తలుపులు మూసుకుపోయాయా? కెప్టెన్ సంచలన ప్రకటన
Vaibhav Sooryavanshi (1)

Updated on: Oct 21, 2026 | 12:22 PM

Vaibhav Sooryavanshi: భారత టీ20 జట్టు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి సంబంధించి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ప్రారంభం కానున్న న్యూజిలాండ్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు మీడియాతో మాట్లాడిన శ్రేయస్ ఈ యువ బ్యాటర్ నేరుగా తుది జట్టులోకి రావడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం జట్టులో అభిషేక్ శర్మ, సంజు శాంసన్ వంటి స్టార్ ఓపెనర్లు అగ్రస్థానంలో నిలకడగా రాణిస్తూ భారీగా పరుగులు సాధిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో ప్రపంచకప్ విజయాల్లోనూ వీరు కీలక పాత్ర పోషించడంతో వెంటనే ఓపెనింగ్ జోడీని మార్చడం కుదరదని ఆయన తేల్చిచెప్పారు.

అవగాహన కోసమే జట్టులో ఎంపిక

అయితే వైభవ్ సూర్యవంశీ జట్టులో ఉండటం చాలా ముఖ్యమని, డ్రెస్సింగ్ రూమ్‌లో అతని ఉనికి సానుకూల వాతావరణాన్ని ఇస్తుందని శ్రేయస్ అభిప్రాయపడ్డారు. ఈ పర్యటన ద్వారా ఆ కుర్రాడికి విదేశీ పిచ్‌లు, అక్కడి కఠినమైన వాతావరణ పరిస్థితులపై పూర్తి అవగాహన వస్తుందని పేర్కొన్నారు. “ఇక్కడ ఎలా ఆడాలో నేర్చుకుంటే భవిష్యత్తులో అతను మరింత మెరుగ్గా సన్నద్ధం కావడానికి ఈ అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుంది” అని శ్రేయస్ వివరించారు. రాబోయే కాలంలో సరైన సమయం వచ్చినప్పుడు వైభవ్‌కు తగిన అవకాశాలు లభిస్తాయని ఆయన భరోసా ఇచ్చారు.

న్యూజిలాండ్ పిచ్‌లపై సవాళ్లు

భారత జట్టు సాధారణంగా స్వదేశంలో ఫ్లాట్ పిచ్‌లపై ఆడేందుకు అలవాటు పడిందని, అయితే న్యూజిలాండ్‌లో పేస్ బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌లు, చలి వాతావరణం ఉంటాయని శ్రేయస్ గుర్తుచేశారు. కివీస్ గడ్డపై వారి సొంత మైదానాల్లో ఆడటం ఎప్పుడూ సవాలుతో కూడుకున్నదే అయినప్పటికీ, తమ జట్టు త్వరగా పరిస్థితులకు అలవాటు పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇంగ్లాండ్ టూర్‌లోనూ తాము అడాప్ట్ అయిన వైనాన్ని ఆయన ఉదాహరణగా చెప్పారు.

బ్యాటింగ్ ఆర్డర్‌లో ఫ్లెక్సిబిలిటీ

జట్టులో బ్యాటింగ్ స్థానాల మార్పు గురించి మాట్లాడుతూ.. మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టుగా ఎవరైనా ఏ నంబర్‌లోనైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉండాలని శ్రేయస్ స్పష్టం చేశారు. ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లు మూడో స్థానంలో అద్భుతంగా రాణిస్తున్నందున తాను అనవసరంగా పైకి రావాలని ప్రయత్నించనని చెప్పారు. జట్టులో అద్భుతమైన బెంచ్ బలం ఉండటం వల్ల ఆటగాళ్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొందని, ఇది జట్టు విజయాలకు మరింత దోహదపడుతుందని కెప్టెన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us