Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీకి చేదు అనుభవం.. ధోనీకి గిఫ్ట్ ఇవ్వలేకపోయిన యువ సంచలనం

ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి టెస్టులో డబుల్ సెంచరీ చేస్తానని వాగ్దానం చేసిన అండర్-19 బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ కేవలం 33 పరుగులకే అవుటయ్యాడు. డబుల్ సెంచరీని ధోనీకి గిఫ్టుగా ఇస్తానని చెప్పి ఫెయిల్ అయ్యాడు. అతడు గత మ్యాచ్‌లో అద్భుతంగా ఆడి 143పరుగులు చేశాడు.

Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీకి చేదు అనుభవం.. ధోనీకి  గిఫ్ట్ ఇవ్వలేకపోయిన యువ సంచలనం
Vaibhav Suryavanshi

Updated on: Jul 07, 2025 | 6:14 PM

Vaibhav Suryavanshi : ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదవ మ్యాచ్‌లో టీమిండియా అండర్-19 జట్టుకు చెందిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఫెయిల్ అయ్యాడు. గత మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో మెరిసిన ఈ ఓపెనర్, చివరి మ్యాచ్‌లో జట్టును తీవ్రంగా నిరాశ పరిచాడు. అతని ఇన్నింగ్స్ కేవలం 42 బంతుల్లోనే ముగిసిపోయింది. అయితే, తన ఇన్నింగ్స్ లో కేవలం రెండు సిక్సర్లు మాత్రమే బాదాడు. సెబాస్టియన్ మోర్గాన్ వైభవ్‌ను అవుట్ చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు వైభవ్ డబుల్ సెంచరీ చేస్తానని ప్రామిస్ చేశాడు. కానీ అది నెరవేరలేదు. పెద్ద షాట్లు ఆడే ప్రయత్నంలో అతను తన వికెట్‌ను కోల్పోయి కేవలం 33 పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టాడు.

భారత ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ పెద్ద తప్పు చేశాడు. మోర్గాన్ వేసిన ఈ ఓవర్ రెండో బంతిని ఆఫ్ సైడ్‌లో పెద్ద షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు. అయితే, ఈ క్రమంలో అతని బాడీ బ్యాలెన్స్ తప్పి, బంతి నేరుగా ఫీల్డర్ అలెక్స్ గ్రీన్ చేతుల్లోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో వైభవ్ 42 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో కేవలం 33 పరుగులు మాత్రమే చేయగలిగాడు.. అయితే ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధిస్తానని అది నేడు బర్త్ డే జరుపుకుంటున్న ధోనీకి గిఫ్టుగా ఇస్తానని అతను వాగ్దానం చేశాడు.

నాలుగో వన్డే మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ సాధించిన తర్వాత, ఒక ఇంటర్వ్యూలో వైభవ్ సూర్యవంశీ, చివరి వన్డే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధిస్తానని వాగ్దానం చేశాడు. తను ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఇంటర్వ్యూలో అతను, తాను మొత్తం 50 ఓవర్లు ఆడటానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. అలా చేస్తే ఎక్కువ పరుగులు చేయగలనని, డబుల్ సెంచరీ కూడా సాధిస్తానని అన్నాడు. ఐపీఎల్ 2025లో అద్భుతమైన సెంచరీ సాధించిన తర్వాత, వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో వన్డే మ్యాచ్‌లో మరో అద్భుతమైన సెంచరీని బాదాడు. అతను కేవలం 78 బంతుల్లో 13 ఫోర్లు, 10 సిక్సర్ల సహాయంతో 143 పరుగులు చేశాడు. అతని ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. వైభవ్ ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 29 సిక్సర్లు బాదాడు. అంతేకాకుండా, అతను ఈ సిరీస్‌లో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ సాయంతో మొత్తం 355 పరుగులు చేశాడు.

 

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ చేయండి..