Umran Malik: టీమిండియాలో చోటు దక్కించుకున్న ఉమ్రాన్‌ మాలిక్‌.. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఎంపిక..

|

May 22, 2022 | 6:17 PM

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(SRH) పేస్‌ సంచలనం ఉమ్రాన్‌ మాలిక్‌(Umran Malik)కు టీమిండియాలో చోటు దక్కింది. దక్షిణాఫ్రికా(ND Vs SA)తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కి వీరిని ఎంపిక చేశారు...

Umran Malik: టీమిండియాలో చోటు దక్కించుకున్న ఉమ్రాన్‌ మాలిక్‌.. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఎంపిక..
Umran Malik
Follow us on

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(SRH) పేస్‌ సంచలనం ఉమ్రాన్‌ మాలిక్‌(Umran Malik)కు టీమిండియాలో చోటు దక్కింది. దక్షిణాఫ్రికా(ND Vs SA)తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కి వీరిని ఎంపిక చేశారు. గత సీజన్‌లో SRH రిటైన్ చేసిన ముగ్గురు ఆటగాళ్లలో మాలిక్ ఒకడు. తన మొదటి సీజన్‌లో అతను 21 వికెట్లు తీసి ఫ్రాంచైజీ విశ్వాసాన్ని చూరగొన్నాడు. అతను తన పేస్‌తో చాలా మంది టాప్-క్లాస్ బ్యాట్స్‌మెన్‌లను ఔట్ చేశాడు. ఇటీవలే 157 కి.మీ వేగంతో IPL చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతిని సాధించిన మాలిక్ ఈ IPLలో ఐదో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా ఉన్నాడు.

13 మ్యాచ్‌లలో 20 సగటుతో 21 వికెట్లుతో ఎకానమీ రేటు 8.93గా ఉంది. పంజాబ్ కింగ్స్‌తో ఆకట్టుకునే సీజన్ తర్వాత లెఫ్టార్మ్ సీమర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా జాతీయ జట్టులోకి వచ్చాడు. ఈ సిరీస్‌కు KL రాహుల్ కెప్టెన్‌గా పంత్‌ వైస్‌కెప్టెన్‌గా వ్యహరించనున్నాడు.

ఇవి కూడా చదవండి

దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌ కోసం భారత జట్టు..

కేఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్/వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.

మరిన్ని క్రీడావార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి..