Cricketer Ban: డోపింగ్ ఉచ్చులో 36 ఏళ్ల క్రికెటర్.. 94 మ్యాచ్‌లు ఆడిన వెటరన్ బ్యాటర్ పై 15 నెలల నిషేధం

Cricketer Ban: యుఏఈ స్టార్ బ్యాటర్ ఆసిఫ్ ఖాన్ డోపింగ్ పరీక్షలో నిషేధిత మెస్టెరోలోన్ వాడినట్లు తేలడంతో ఐసీసీ 15 నెలల నిషేధం విధించింది. 94 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన 36 ఏళ్ల వెటరన్ బ్యాటర్‌పై ఈ వేటు 2025 సెప్టెంబర్ 8 నుంచి అమల్లోకి వచ్చింది. 2026 డిసెంబర్ 8 నుంచి పోటీ క్రికెట్‌లోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది.

Cricketer Ban: డోపింగ్ ఉచ్చులో 36 ఏళ్ల క్రికెటర్.. 94 మ్యాచ్‌లు ఆడిన వెటరన్ బ్యాటర్ పై 15 నెలల నిషేధం
Asif Khan Ban

Updated on: Aug 27, 2026 | 4:01 PM

Cricketer Ban: అంతర్జాతీయ క్రికెట్‌లో డోపింగ్ కలకలం రేపింది. 94 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన యుఏఈ స్టార్ బ్యాటర్ ఆసిఫ్ ఖాన్‌పై ఐసీసీ 15 నెలల పాటు నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆసియా కప్ 2025 సందర్భంగా భారత్‌తో మ్యాచ్‌కు రెండ్రోజుల ముందు నిర్వహించిన పరీక్షల్లో నిషేధిత పదార్థాలు వాడినట్లు తేలడంతో ఈ వేటు పడింది. ఐసీసీ వెల్లడించిన అధికారిక ప్రకటన ప్రకారం, ఆసియా కప్ టోర్నీలో యుఏఈ జట్టు భారత్‌తో మ్యాచ్ ఆడటానికి కేవలం రెండు రోజుల ముందు, అంటే 2025 సెప్టెంబర్ 8న ఆసిఫ్ ఖాన్‌కు అవుట్-ఆఫ్-కాంపిటీషన్ డోప్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆయన నిషేధిత డ్ర*గ్ అయిన మెస్టెరోలోన్ వాడినట్లు రుజువైంది. ఆసిఫ్ ఖాన్ కూడా ఐసీసీ యాంటీ డోపింగ్ కోడ్ నిబంధనల ఉల్లంఘనను అంగీకరించారు. ప్రపంచ ఉత్ప్రేరక నిరోధక సంస్థ (WADA), ఐసీసీ అంగీకారంతో ఈ 15 నెలల సస్పెన్షన్ ఖరారైంది.

ఎప్పటి నుంచి అమలులోకి రానుంది?

ఈ నిషేధ కాలం ఆయన పరీక్షలు పూర్తి చేసుకున్న 2025 సెప్టెంబర్ 8 నుంచి అమలులోకి వచ్చి, 2026 డిసెంబర్ 7 వరకు కొనసాగనుంది. 36 ఏళ్ల ఈ వెటరన్ ఆటగాడు 2026 అక్టోబర్ 8 నుంచి తన జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేయడానికి లేదా క్లబ్ సదుపాయాలు ఉపయోగించడానికి అర్హత సాధిస్తారు. అయితే పోటీ క్రికెట్‌లోకి మళ్ళీ అడుగు పెట్టడానికి మాత్రం 2026 డిసెంబర్ 8 వరకు వేచి చూడాల్సిందే. ఒక రకంగా ఆయన కెరీర్‌కు ఇది పెద్ద మైసన్ పాయింట్‌గా మారింది.

పాకిస్థాన్ నుంచి వచ్చి యుఏఈ హీరోగా మార్పు

పాకిస్థాన్‌లోని లాహోర్‌లో జన్మించిన ఆసిఫ్ ఖాన్ ఆరంభంలో పాకిస్థాన్ అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత యుఏఈకి తరలివెళ్ళి 2022లో అక్కడి జాతీయ జట్టు తరఫున అంతర్జాతీయ డెబ్యూ చేశారు. స్వల్ప కాలంలోనే యుఏఈ జట్టులో కీలక బ్యాటర్‌గా ఎదిగిన ఆయన, తన ఆక్రమణ శైలి ఆటతీరుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

ట్రాక్ రికార్డ్ అద్భుతం.. కానీ వివాదం

ఆసిఫ్ ఖాన్ ఇప్పటివరకు యుఏఈ తరఫున 38 వన్డేలు ఆడి 37 ఇన్నింగ్స్‌ల్లో 1,270 పరుగులు సాధించారు. ఇందులో 3 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20 విషయానికి వస్తే 56 మ్యాచ్‌ల్లో 137.92 విస్ఫోటక స్ట్రైక్ రేట్‌తో 1,302 పరుగులు చేశారు. అందులో 6 ఫిఫ్టీలు నమోదు చేశారు. సుదీర్ఘ అనుభవం ఉన్న ఆటగాడు డోప్ టెస్ట్‌లో దొరికిపోవడంతో యుఏఈ క్రికెట్ బోర్డు తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us