
Viral Video : ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్థాన్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌పై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. పహల్గామ్ ఉగ్రదాడి కారణంగా భారతదేశంలో పాకిస్థాన్‌పై చాలా కోపం ఉంది. అందుకే మ్యాచ్‌ను రద్దు చేయాలని డిమాండ్ వచ్చింది. అయితే, బీసీసీఐ ఒక ప్రకటనలో ఏసీసీ, ఐసీసీ టోర్నమెంట్‌లలో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.
అందుకే సెప్టెంబర్ 14న దుబాయ్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం జరిగింది. ఈ మ్యాచ్ తర్వాత వివాదాలు మొదలయ్యాయి. ఒకవైపు భారత ఆటగాళ్లు పాకిస్థాన్ జట్టుతో కరచాలనం చేయలేదు. మరోవైపు పీసీబీ పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాను మీడియా ప్రెజెంటేషన్‌కు పంపించలేదు. ఈ సంఘటనల వెనుక ఉన్న నిజాలు, వైరల్ వీడియో గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
షాహిద్ అఫ్రిది భారతదేశం, భారత ఆటగాళ్ల గురించి తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటాడు. అందుకే జై షా, అనురాగ్ ఠాకూర్‌ను అఫ్రిదితో చూసి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఈ వీడియో ఆసియా కప్‌లో జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ది కాదు. ఈ వీడియో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అప్పుడు చిత్రీకరించింది. అప్పుడు కూడా భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను చూసేందుకు చాలామంది ప్రముఖులు వచ్చారు, వారిలో జై షా, అనురాగ్ ఠాకూర్, షాహిద్ అఫ్రిది కూడా ఉన్నారు. ఈ వీడియో అప్పటిదే. ఆ సమయంలో పహల్గామ్ ఉగ్రదాడి జరగలేదు.
Anurag Thakur, Jay Shah, and Shahid Afridi are in the stadium watching the India Pakistan match like high school friends. But some twitter patriots wants to boycott the game vs Pakistan 😀 #INDvPAK #AsiaCup
pic.twitter.com/T7gB1CqkC7— Nibraz Ramzan (@nibraz88cricket) September 14, 2025
ఆసియా కప్ 2025లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా సులభంగానే గెలిచింది. కానీ, మ్యాచ్ ముగియగానే క్రీజ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే పాకిస్థాన్ ఆటగాళ్లతో చేతులు కలపకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది కూడా మెట్ల మీద నిలబడి ఈ ఇద్దరు రాగానే లోపలికి వెళ్లి డ్రెస్సింగ్ రూమ్ తలుపులు మూసుకున్నారు. మరోవైపు పాకిస్థాన్ ఆటగాళ్లు టీమిండియా తమతో చేతులు కలుపుతుందని ఎదురుచూస్తూ మైదానంలో నిలబడ్డారు. కానీ, అది జరగలేదు. ఆ తర్వాత పీసీబీ తమ అసంతృప్తిని తెలియజేస్తూ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాను మ్యాచ్ ప్రెజెంటేషన్ సెర్మనీకి పంపించలేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..