IND vs SA : కోల్‌కతా టెస్ట్ ఓటమికి కారణాలివే.. 1000 వికెట్ల అనుభవం ముందు తలవంచిన యంగ్ బ్యాటర్లు

కోల్‌కతా టెస్ట్‌లో సౌతాఫ్రికా చేతిలో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓడిపోవడం భారత అభిమానులకు మింగుడుపడని విషయం. ఈ టెస్ట్ మ్యాచ్ కేవలం రెండున్నర రోజుల్లోనే ముగిసింది. నాలుగో ఇన్నింగ్స్‌లో భారత్ గెలవడానికి కేవలం 124 పరుగుల లక్ష్యం మాత్రమే ఉన్నా, భారత బ్యాటింగ్ లైనప్ పూర్తిగా విఫలమై 93 పరుగులకే ఆలౌట్ అయింది.

IND vs SA : కోల్‌కతా టెస్ట్ ఓటమికి కారణాలివే.. 1000 వికెట్ల అనుభవం ముందు తలవంచిన యంగ్ బ్యాటర్లు
Ind Vs Sa

Updated on: Nov 16, 2025 | 4:09 PM

IND vs SA : కోల్‌కతా టెస్ట్‌లో సౌతాఫ్రికా చేతిలో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓడిపోవడం భారత అభిమానులకు మింగుడుపడని విషయం. ఈ టెస్ట్ మ్యాచ్ కేవలం రెండున్నర రోజుల్లోనే ముగిసింది. నాలుగో ఇన్నింగ్స్‌లో భారత్ గెలవడానికి కేవలం 124 పరుగుల లక్ష్యం మాత్రమే ఉన్నా, భారత బ్యాటింగ్ లైనప్ పూర్తిగా విఫలమై 93 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో ఏడుగురు భారత బ్యాటర్లు కనీసం డబుల్ డిజిట్ స్కోరు కూడా చేయలేకపోగా, నలుగురు బ్యాటర్లు అయితే కనీసం ఖాతా కూడా తెరవలేకపోయారు. ఇంత తక్కువ టార్గెట్‌ను అందుకోలేకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? భారత జట్టు ఓటమికి దారితీసిన మూడు ప్రధాన కారణాలు తెలుసుకుందాం.

రెండు ఇన్నింగ్స్‌లలోనూ పేలవమైన ఆరంభం

ఈ టెస్ట్ మ్యాచ్‌లో రెండు రోజుల నుంచే పిచ్ స్పిన్నర్లకు అనుకూలించడం మొదలైంది. కానీ భారత జట్టు రెండు ఇన్నింగ్స్‌లలోనూ సరైన ఆరంభాన్ని ఇవ్వలేకపోయింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ కలిసి కేవలం 18 పరుగులే జోడించారు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. స్కోరు సున్నా పరుగులకే టీమిండియా తొలి వికెట్‌ను కోల్పోయింది. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ జట్టుకు బలమైన పునాది వేయడంలో విఫలమయ్యాడు. ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడంతో, చిన్న లక్ష్యం కూడా భారత్‌కు చాలా పెద్దదిగా మారిపోయింది.

చివరిలో బలహీనపడిన బౌలింగ్

మొదటి ఇన్నింగ్స్‌లో 30 పరుగుల ఆధిక్యం ఉండటం భారత జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించి సౌతాఫ్రికా 7 వికెట్లను కేవలం 91 పరుగులకే పడగొట్టారు. అయితే అక్కడే భారత జట్టు పట్టు కోల్పోయింది. సౌతాఫ్రికా జట్టు చివరి 3 వికెట్లు కలిసి ఏకంగా 62 పరుగులు జోడించాయి. ఈ అదనపు పరుగులు భారత బ్యాటర్లపై తీవ్ర ఒత్తిడిని పెంచాయి. ఈ 62 పరుగులే చివరికి భారత్‌ను ఓడించడానికి కీలకమయ్యాయి. బౌలింగ్‌లో చివర్లో వికెట్లు తీయడంలో విఫలం కావడం ఓటమికి రెండో ప్రధాన కారణం.

సైమన్ హార్మర్ అనుభవం ముందు తలవంచడం

సాధారణంగా ఈడెన్ గార్డెన్స్ పిచ్‌లో మూడో రోజు నుంచి స్పిన్నర్లకు మద్దతు లభిస్తుంది. కానీ ఈ మ్యాచ్‌లో రెండో రోజు నుంచే స్పిన్నర్లు వికెట్లు తీయడం మొదలు పెట్టారు. ఇక్కడే సైమన్ హార్మర్ అనే అనుభవజ్ఞుడైన స్పిన్నర్ తన సత్తా చూపాడు. ఈ బౌలర్‌కు ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 1000 కంటే ఎక్కువ వికెట్లు తీసిన అనుభవం ఉంది. అతని అనుభవం సౌత్ ఆఫ్రికాకు బాగా ఉపయోగపడింది. హార్మర్ ఈ మ్యాచ్‌లో మొత్తం 8 వికెట్లు తీసి భారత బ్యాటింగ్‌ను కూల్చేశాడు. అతను సరైన టర్న్, బౌన్స్ ఉపయోగించి వికెట్లు తీయడం, అలాగే తన సహచర బౌలర్ కేశవ్ మహారాజ్‌కు కూడా సలహాలు ఇవ్వడం.. సౌతాఫ్రికా విజయానికి అతిపెద్ద కారణం. అతని అనుభవం ముందు భారత బ్యాటర్లు నిలబడలేకపోయారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..