Indian Cricket Team: ఫైనల్స్‌లో తడబడుతోన్న టీమిండియా; ఏడేళ్లలో 6 ఐసీసీ ట్రోఫీలు మిస్!

|

Jun 24, 2021 | 4:58 PM

2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భారత జట్టు న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. రిజర్వ్ డే వరకు జరిగిన ఈ మ్యాచ్‌లో కివీస్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో తొలి ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను భారత్ గెలుచుకోలేకపోయింది.

1 / 6
2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భారత జట్టు న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. రిజర్వ్ డే వరకు జరిగిన ఈ మ్యాచ్‌లో  కివీస్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో తొలి ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకోలేకపోయింది. 2013 లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నప్పటి నుంచి టీమిండియా దాదాపు ప్రతీ ఐసీసీ టోర్నమెంట్లో సెమీ-ఫైనల్స్, లేదా ఫైనల్స్‌కు చేరుకుంది.  కానీ ట్రోఫీని సాధించలేక చతికిలపడుతోంది. 2014 నుంచి టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ వరకు దాదాపు భారత్ ఆరుసార్లు ఓడిపోయింది. పురుషులతోపాటు మహిళల టీం, అండర్ -19 జట్టును తీసుకుంటే ఈ సంఖ్య మరింత పెరుగుతోంది. 2017 ప్రపంచ కప్, 2020లో టీ 20 ప్రపంచ కప్ ఫైనల్స్‌లో భారత మహిళల జట్టు ఓడిపోయింది. భారత అండర్ -19 టీం 2016, 2020 ప్రపంచ కప్‌ ఫైనల్స్‌లో ఓడిపోయింది.

2 / 6
2014 T20 World Cup Final: మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని భారత జట్టు టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్‌కు చేరుకుంది. చివరి పోరులో శ్రీలంకతో తలపడిన భారత్ ఘోర పరాజయం పొందింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు లసిత్ మలింగ అద్భుతంగా బౌలింగ్ చేయండంతో 4 వికెట్లు కోల్పోయి కేవలం 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం శ్రీలంక ఈ స్కోర్‌ను 17.5 ఓవర్లలో సాధించి, టీ20 ట్రోఫీని కైవసం చేసుకుంది.

3 / 6
2015 World Cup Semi-Final:డిఫెండింగ్ ఛాంపియన్ గా టీమిండియా బరిలోకి దిగింది. టోర్నీ మొత్తం అద్బుతంగా ఆడి, సెమీ ఫైనల్ చేరారు. సెమీస్‌లో ఆస్ట్రేలియాతో పోరుకు సిద్ధమయ్యారు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 95 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను 233 పరుగులకు ఆలౌట్ అయ్యారు. ఫైనల్‌లో ఆస్ట్రేలియా గెలిచి ఐదవసారి ప్రపంచ కప్‌ను ముద్దాడింది.

4 / 6
2016 T20 World Cup Semi-Final: ఈ టోర్నమెంట్ మనదేశంలోనే జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 2 వికెట్ల కోల్పోయి 192 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ టీం రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని సాధించింది. అలాగే ఫైనల్‌లోనూ వెస్టిండీస్ టీం గెలిచి టీ20 కప్‌ను గెలుచుకుంది.

5 / 6
2017 Champions Trophy Final: విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు తొలిసారి ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్లో దాయాది టీంతో తలపడేందుకు సిద్ధమైంది. కానీ, పాకిస్తాన్ అద్భుతంగా ఆడడంతో కోహ్లీసేనకు ఓటమి తప్పలేదు. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 4 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. టీమిండియా ఏ దశలోనూ పోరాటం చేయలేక కేవలం 158 పరుగులకు ఆలౌట్ అయ్యారు.

6 / 6
2019 World Cup Semi-Final: ఈ సారి కూడా విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు నాకౌట్ దశకు చేరుకుంది. ఈసారి సెమీస్‌లో న్యూజిలాండ్‌తో పోరుకు సిద్ధమైంది కోహ్లీసేన. కేన్ విలియమ్సన్ సారథ్యంలోని కివీస్‌ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 8 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌ కు వర్షం అడ్డంకిగా మారింది. దీంతో రిజర్వ్‌డేన టీమిండియా లక్ష్య చేధనకు దిగి 221 పరుగులకు చేతులెత్తేశారు. దీంతో 18 పరుగుల తేడాతో కివీస్ చేతిలో ఓడిపోయింది.