Video: వన్డే క్రికెట్‌ చరిత్రలోనే అద్భుతం.. 16 బంతుల్లోనే 5 వికెట్లు.. సరికొత్త రికార్డ్ లిఖించిన భారత బౌలర్ గుర్తున్నాడా..

Asia Cup 2023 India vs Sri Lanka: ఒకే ఓవర్లో 4 వికెట్లు తీసిన సిరాజ్.. 6వ ఓవర్ 4వ బంతికి శ్రీలంక కెప్టెన్ దసున్ షనకను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 4 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసి ప్రత్యేక ఫీట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అంతే కాకుండా, అతి తక్కువ బంతుల్లో 5 వికెట్లు తీసిన ప్రపంచంలో 2వ బౌలర్‌గా ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పాడు.

Video: వన్డే క్రికెట్‌ చరిత్రలోనే అద్భుతం.. 16 బంతుల్లోనే 5 వికెట్లు.. సరికొత్త రికార్డ్ లిఖించిన భారత బౌలర్ గుర్తున్నాడా..
Ind Vs Sl Siraj Bowling
Follow us

|

Updated on: Sep 17, 2024 | 3:22 PM

Mohammad Siraj Greatest Spell in ODI Cricket: అది సెప్టెంబర్ 17, 2023.. ఆర్ ప్రేమదాస గ్రౌండ్‌లో జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ వర్సెస్ శ్రీలంక జట్లు తలపడ్డాయి. దసున్ షనక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీని ప్రకారం ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక జట్టు 16 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయింది. ఇలా టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ కేవలం 16 బంతుల్లో ఐదు వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టుకు జస్ప్రీత్ బుమ్రా తొలి ఓవర్‌లోనే షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత మియా మ్యాజిక్ మొదలైంది. సిరాజ్ 4వ ఓవర్ తొలి బంతికి పాతుమ్ నిసంక వికెట్ పడగొట్టగా, మూడో బంతికి సదీర సమరవిక్రమ ఎల్బీడబ్ల్యూగా చిక్కుకున్నాడు. నాలుగో బంతికి అసలంకను అవుట్ చేశాడు. ఆరో బంతికి ధనంజయ డిసిల్వా వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు.

ఇవి కూడా చదవండి

ఒకే ఓవర్లో 4 వికెట్లు తీసిన సిరాజ్.. 6వ ఓవర్ 4వ బంతికి శ్రీలంక కెప్టెన్ దసున్ షనకను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 4 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసి ప్రత్యేక ఫీట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అంతే కాకుండా, అతి తక్కువ బంతుల్లో 5 వికెట్లు తీసిన ప్రపంచంలో 2వ బౌలర్‌గా ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పాడు. ఇంతకు ముందు చమిందా వాస్ ఈ ఘనత సాధించాడు.

2003లో బంగ్లాదేశ్‌పై శ్రీలంక మాజీ పేసర్ చమిందా వాస్ కేవలం 16 బంతుల్లో 5 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రపంచ రికార్డును సమం చేసి మహ్మద్ సిరాజ్ కొత్త చరిత్ర సృష్టించాడు.

ఈ మ్యాచ్‌లో 7 ఓవర్లు బౌలింగ్ చేసిన మహ్మద్ సిరాజ్ 21 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ ధాటికి తడబడిన శ్రీలంక జట్టు కేవలం 50 పరుగులకే ఆలౌటైంది.

51 పరుగుల సులువైన లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా 6.1 ఓవర్లలో 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 8వ సారి ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. ఈ చారిత్రాత్మక విజయంతో ఇది ప్రత్యేక సంవత్సరంగా నిలిచింది.

భారత్ ప్లేయింగ్ 11: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

శ్రీలంక ప్లేయింగ్ 11: పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక (కెప్టెన్), దునిత్ వెల్లలే, దుషన్ హేమంత, ప్రమోద్ మదుషన్, మతిష పతిరన.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఒకటి కన్నా ఎక్కువ పాన్‌కార్డులుండడం నేరమా? నిబంధనలు ఇవి..
ఒకటి కన్నా ఎక్కువ పాన్‌కార్డులుండడం నేరమా? నిబంధనలు ఇవి..
16 బంతుల్లోనే 5 వికెట్లు.. సరికొత్త రికార్డ్ లిఖించిన భారత బౌలర్
16 బంతుల్లోనే 5 వికెట్లు.. సరికొత్త రికార్డ్ లిఖించిన భారత బౌలర్
ఇడ్లీను ప్రతి రోజూ తినడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందంటే..
ఇడ్లీను ప్రతి రోజూ తినడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందంటే..
మోదీ 3.0 సర్కార్ 100 రోజుల్లో సాధించిన విజయాలు..!
మోదీ 3.0 సర్కార్ 100 రోజుల్లో సాధించిన విజయాలు..!
ఎందుకంత తొందర గురూ..!త్వరగా వెళ్లాలనుకున్నాడు..ఇలా ఇరుక్కుపోయాడు
ఎందుకంత తొందర గురూ..!త్వరగా వెళ్లాలనుకున్నాడు..ఇలా ఇరుక్కుపోయాడు
ఈ పండ్లు ఫ్రిజ్‌లో పెట్ట కూడదని మీకు తెలుసా.. అవి ఏంటంటే..
ఈ పండ్లు ఫ్రిజ్‌లో పెట్ట కూడదని మీకు తెలుసా.. అవి ఏంటంటే..
బెంగళూరు దరి చేరనున్న కేఎల్ రాహుల్.. బిగ్ షాకిస్తోన్న ఆ రూల్?
బెంగళూరు దరి చేరనున్న కేఎల్ రాహుల్.. బిగ్ షాకిస్తోన్న ఆ రూల్?
ఉత్తమ నటిగా ఐశ్వర్యకు అవార్డు.. ఆరాధ్య కళ్లల్లో ఆనందం చూశారా?
ఉత్తమ నటిగా ఐశ్వర్యకు అవార్డు.. ఆరాధ్య కళ్లల్లో ఆనందం చూశారా?
ప్రభుత్వం మారింది... పద్దతులూ మారుతున్నాయి..!
ప్రభుత్వం మారింది... పద్దతులూ మారుతున్నాయి..!
టోల్ గేట్లకు ఇక స్వస్తి.. శాటిలైట్ ఆధారిత కొత్త వ్యవస్థ..
టోల్ గేట్లకు ఇక స్వస్తి.. శాటిలైట్ ఆధారిత కొత్త వ్యవస్థ..
వినాయకుడిని మాత్రమే ఎందుకు నిమజ్జనం చేస్తారు.? ఓహో ఇదా స్టోరీ..
వినాయకుడిని మాత్రమే ఎందుకు నిమజ్జనం చేస్తారు.? ఓహో ఇదా స్టోరీ..
సౌత్ సంప్రదాయంలో హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి ఇక భార్య భర్తలు!
సౌత్ సంప్రదాయంలో హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి ఇక భార్య భర్తలు!
జానీ.. జానీ.. ఏమిటీ రాంగ్ స్టెప్.? లేదా జానీపై కేవలం ఆరోపణలేనా.!
జానీ.. జానీ.. ఏమిటీ రాంగ్ స్టెప్.? లేదా జానీపై కేవలం ఆరోపణలేనా.!
దేవర ముంగిట నువ్వెంత.. NTRకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్.!
దేవర ముంగిట నువ్వెంత.. NTRకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్.!
దళపతికి చివరి సినిమాకి అడ్డుపడుతున్న బాలీవుడ్ స్టార్.!
దళపతికి చివరి సినిమాకి అడ్డుపడుతున్న బాలీవుడ్ స్టార్.!
అప్పుడే OTTలోకి నాని సరిపోదా శనివారం.! ఎప్పటినుండి అంటే..
అప్పుడే OTTలోకి నాని సరిపోదా శనివారం.! ఎప్పటినుండి అంటే..
ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు|ఈ ఇద్దరు బాబులదే ఆ అరుదైన ఘనత!
ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు|ఈ ఇద్దరు బాబులదే ఆ అరుదైన ఘనత!
'ఇది మనిషి దురాశ' చవితి ఉత్సవాలపై రేణూ షాకింగ్ కామెంట్స్.!
'ఇది మనిషి దురాశ' చవితి ఉత్సవాలపై రేణూ షాకింగ్ కామెంట్స్.!
24 గంట‌ల్లోనే ఓటీటీలో సరికొత్త రికార్డు సృష్టించిన ‘రఘు తాత’ మూవీ
24 గంట‌ల్లోనే ఓటీటీలో సరికొత్త రికార్డు సృష్టించిన ‘రఘు తాత’ మూవీ
ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలం.! ఈసారి ఎన్ని లక్షలు అంటే..
ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలం.! ఈసారి ఎన్ని లక్షలు అంటే..