IND vs BAN: బంగ్లాతో టెస్ట్ సిరీస్ నుంచి టీమిండియా స్టార్ ప్లేయర్ ఔట్.. కారణం ఏంటో తెలుసా?

|

Aug 12, 2024 | 4:09 PM

Jasprit Bumrah May Be Rested From Bangladesh Series: భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గురించి కీలక అప్‌డేట్ వచ్చింది. టీ20 ప్రపంచకప్ తర్వాత బుమ్రా ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. ఆయనకు కంటిన్యూగా రెస్ట్ ఇస్తున్నారని, ఇప్పుడు ఆయన తిరిగి రాలేడని వార్తలు వస్తున్నాయి. నివేదికల ప్రకారం, వచ్చే నెల నుంచి బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు బుమ్రా దూరంగా ఉండవచ్చని తెలుస్తోంది.

1 / 5

2 / 5
జస్ప్రీత్ బుమ్రా గురించి మాట్లాడితే, అతను గత నెలన్నరగా ఫీల్డ్‌కి దూరంగా ఉన్నాడు. అతను జున్ 29న ICC T20 వరల్డ్ కప్‌లో ఫైనల్ మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి విశ్రాంతి తీసుకుంటున్నాడు. బుమ్రా శ్రీలంక పర్యటనకు ఎంపిక కాలేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వన్డేలలో తిరిగి వచ్చారు. కానీ, బుమ్రాకు విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే.

3 / 5
వచ్చే నెల 19 నుంచి బంగ్లాదేశ్‌తో భారత్ టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ నుంచి జస్ప్రీత్ బుమ్రా తిరిగి వస్తాడని అనుకున్నారు,. కానీ, అది జరిగేలా కనిపించడం లేదు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, బుమ్రా ఈ సిరీస్‌లో కూడా పాల్గొనడం లేదు. ఆ తర్వాత అతను తదుపరి సిరీస్‌లో ఆడే అవకాశం ఉంది. అంటే అక్టోబర్‌లోనే జస్ప్రీత్ బుమ్రా ఫీల్డ్‌లో కనిపించవచ్చు.

4 / 5
టీమిండియాలోని ఇద్దరు గొప్ప బ్యాట్స్‌మెన్‌లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి కూడా కీలక వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మీడియా నివేదికల ప్రకారం, ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ రాబోయే దులీప్ ట్రోఫీలో ఆడనున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు చాలా కాలంగా దేశవాళీ టోర్నీలో ఆడలేదు. చాలా కాలం తర్వాత పునరాగమనం చేయబోతున్నారు.

5 / 5
అయితే, ఈ టోర్నీలో కూడా జస్ప్రీత్ బుమ్రా ఆడడం లేదు. శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్ వంటి ఆటగాళ్లను కూడా ఇందులో ఆడమని బీసీసీఐ కోరింది. ఇషాన్ కిషన్‌ను కూడా ఏ జట్టులోనైనా చేర్చుకోవచ్చు. ఇప్పుడు బుమ్రా ఎప్పుడు మైదానంలోకి వస్తాడో చూడాలి.