క్రికెట్ మైదానంలో బ్యాట్ ఘాటుగా మాట్లాడే భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ.. ప్రేమ మైదానంలో మాత్రం చాలా కూల్‌గా వ్యవహరించాడు. అయితే, రోహిత్ లవ్‌స్టోరీ సినిమా కథ కంటే తక్కువేం కాదండోయ్. రోహిత్ భార్య రితికా స్పోర్ట్స్ ఈవెంట్ మేనేజర్‌గా పనిచేసేది. ఈ కారణంగా వారిద్దరూ కలుసుకున్నారు. ఆ తర్వాత క్రమంగా కలుసుకోవడం, స్నేహం, ఆ తర్వాత ప్రేమగా మారింది. రితికాతో రోహిత్ దాదాపు 6 ఏళ్ల పాటు డేటింగ్ చేశాడు.
రోహిత్ తన భార్య రితికాకు సినిమా స్టైల్‌లో ప్రపోజ్ చేశాడు. అందుకోసం ఆమెనుడిన్నర్‌కో లేదా డేట్‌కి తీసుకెళ్లలేదు. రోహిత్ రితికను బోరివాలి స్పోర్ట్స్ క్లబ్‌కు తీసుకెళ్లి అక్కడ మోకాళ్లపై కూర్చోని ప్రపోజ్ చేశాడు. 11 ఏళ్ల వయసులో రోహిత్ ఈ క్లబ్‌లో తొలి మ్యాచ్ ఆడాడు. అందుకే అక్కడికే తీసుకెళ్లి ఇంప్రెస్ చేశాడు.
2015 IPL సీజన్‌లో, రోహిత్ శర్మ ఒకరితో డేటింగ్ చేస్తున్నారనే చర్చలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించాయి. ఆ తరువాత, ఇద్దరూ కలిసి వారి సంబంధం గురించి అందరికీ చెప్పేశారు. రోహిత్ 2015 డిసెంబర్ 13న రితికను వివాహం చేసుకున్నాడు.
రోహిత్ శర్మ భార్య రితికా మాజీ భారత ఆటగాడు యువరాజ్ సింగ్‌కి రాఖీ సోదరి అంట. ఇదే వీరిద్దరినీ కలుసుకునేలా చేసిందంట. రోహిత్ తొలిసారి కలిసినప్పుడు రితికాకు పెద్దగా నచ్చలేదంట.
ప్రస్తుతం రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లలో భారత జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. అతని నికర విలువ గురించి మాట్లాడితే, దాదాపు రూ.160 కోట్లు అని వార్తలు వినిపిస్తున్నాయి. 2015 సంవత్సరంలోనే, రోహిత్ వర్లీలో 4 ఎకరాల ఫ్లాట్‌ను కొనుగోలు చేశాడు. దాని అంచనా వ్యయం రూ. 30 కోట్లని అంటున్నారు.
రోహిత్ శర్మ, రితికల జోడీకి 2018 సంవత్సరంలో కుమార్తె జన్మించింది. ఇద్దరూ తమ కూతురికి సమైరా అని పేరు పెట్టారు. కూతురు పుట్టిన తరుణంలో రోహిత్ ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్నాడు. అయితే ఈ శుభవార్త తెలిసిన వెంటనే ఇండియాకు వచ్చి ఈ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు.