Team India: నాడు కిట్ కొనడానికి డబ్బుల్లేవు.. ఒక్కపూట భోజనంతో ప్రాక్టీస్.. నేడు కోట్ల సంపదకు ఓనర్..!

Team India All Rounder: ఈ టీమిండియా ఆల్‌రౌండర్ జీవితం ఒకప్పుడు ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో సాగింది. క్రికెట్ కిట్ కొనడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో అన్నతో కలిసి సాధన చేశాడు. ఒక్కపూట భోజనంతో సరిపెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఐపీఎల్‌ అవకాశం తరువాత అతడి పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

Team India: నాడు కిట్ కొనడానికి డబ్బుల్లేవు.. ఒక్కపూట భోజనంతో ప్రాక్టీస్.. నేడు కోట్ల సంపదకు ఓనర్..!
Team India Player

Updated on: Sep 22, 2026 | 4:12 PM

భారత క్రికెట్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ పేరు ఇప్పుడు క్రికెట్‌తో పాటు విలాసవంతమైన జీవనశైలితో ముడిపడి ఉంది. ఖరీదైన కార్లు, విలువైన వాచీలు, అత్యంత సౌకర్యవంతమైన ఇంటిలో జీవితం ఎంతో విలాసవంతంగా సాగుతోంది. కానీ ఈ స్థాయికి చేరే ముందు అతడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చిన్న వయసులో అన్తో కలిసి క్రికెట్‌పై దృష్టి పెట్టిన సమయంలో కుటుంబ పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉండేవి. క్రికెట్ కిట్ కొనడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఉండేది. ఇద్దరు సోదరులు ఒక్కపూట భోజనంతో గడుపుతూ మిగిలిన డబ్బును క్రికెట్ అవసరాల కోసం దాచుకునేవారు. ప్రాక్టీస్ సమయంలో మ్యాగీ తింటూ రోజులు గడిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయనెవరో కాదు టీమిండియా ఆల్ రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.

హార్దిక్, క్రుణాల్ కలిసి క్రికెట్ సాధన చేసేవాడు. ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందులు వారి శిక్షణపై ప్రభావం చూపాయి. వేడి నీటి కోసం మాలి సహాయం తీసుకుని మ్యాగీ తయారు చేసుకుని తిన్న సందర్భాలు కూడా ఉన్నాయంటూ ఓ సందర్భంలా తెలిపారు. సౌకర్యాలు లేకపోయినా క్రికెట్‌పై ఇద్దరూ దృష్టి కొనసాగించారు.

రంజీ ట్రోఫీ (Ranji Trophy) జట్టులోకి ఎంపికయ్యే సమయానికి ఈ ఇద్దరు సోదరుల వద్ద ఒకే బ్యాట్ ఉండేది. భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) ఆ బ్యాట్‌ను వారికి బహుమతిగా ఇచ్చాడు. పరిమిత వనరులతోనే సాధన సాగించిన హార్దిక్‌ కెరీర్‌కు ఆ దశ కీలకంగా మారింది.

2015 ఐపీఎల్ (IPL) వేలంలో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) హార్దిక్‌ను రూ.10 లక్షలకు తీసుకుంది. అక్కడే అతడి ప్రొఫెషనల్ కెరీర్‌లో కీలక మలుపు మొదలైంది. ముంబై జట్టుతో అరంగేట్రం చేసిన అతడు, ఆ తరువాత 2016లో భారత జట్టులోకి కూడా వచ్చాడు.

ఐపీఎల్‌లో వచ్చిన అవకాశాలను హార్దిక్ సద్వినియోగం చేసుకున్నాడు. లభించిన సమాచారం ప్రకారం ఐపీఎల్ ద్వారా అతడు ఇప్పటివరకు రూ.120 కోట్లకుపైగా సంపాదించాడు. బీసీసీఐ (BCCI) సెంట్రల్ కాంట్రాక్ట్, మ్యాచ్ ఫీజుల ద్వారా కూడా అతడికి గణనీయమైన ఆదాయం వచ్చింది. అతడి నికర ఆస్తుల విలువ సుమారు రూ.100 కోట్లుగా మారింది.

ప్రస్తుతం హార్దిక్ వద్ద రోల్స్ రాయిస్, మెర్సిడెస్ ఏఎంజీ జీ63, పోర్షే కయేన్, రేంజ్ రోవర్ వంటి ఖరీదైన కార్లు ఉన్నట్లు సమాచారం. కోట్ల విలువ చేసే పలు వాచీలు కూడా అతడి వద్ద ఉన్నాయి. ఒక్కపూట భోజనంతో గడిపిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు హార్దిక్ ప్రయాణం సాగింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us