T20 World Cup 2024: మరోసారి టీమిండియాపై విషం కక్కిన పాక్ క్రికెటర్లు.. ఆ ప్లేయర్లపై సంచలన ఆరోపణలు

|

Jun 25, 2024 | 8:42 PM

ప్రపంచకప్ లో భారత్‌ విజయాల పరంపర కొనసాగుతోంది. అయితే భారత్ ఆటతీరును పాకిస్థాన్‌ క్రికెటర్లు కుళ్లుకుంటున్నారు. టీమిండియా ప్లేయర్లపై పనికి మాలిన ఆరోపణలు చేస్తున్నారు. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా సెమీఫైనల్‌కు చేరుకుంది. దీనికి తోడు అఫ్ఘానిస్థాన్ కూడా సెమీఫైనల్‌కు వెళ్లడంతో పాకిస్థాన్‌ క్రికెటర్లు రగిలిపోతున్నారు

T20 World Cup 2024: మరోసారి టీమిండియాపై విషం కక్కిన పాక్ క్రికెటర్లు.. ఆ ప్లేయర్లపై సంచలన ఆరోపణలు
Team India
Follow us on

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌కు తొలి రౌండ్‌లోనే పరాభవం ఎదురైంది. ముఖ్యంగా అమెరికా చేతిలో ఓటమితో ఆ జట్టు సూపర్ -8 అవకాశాలు అడుగంటాయి. ఆ తర్వాత భారత్ చేతిలోనూ చావు దెబ్బ తినడంతో పాక్ ఆశలన్నీ ఆవిరయ్యాయి. మరోవైపు ప్రపంచకప్ లో భారత్‌ విజయాల పరంపర కొనసాగుతోంది. అయితే భారత్ ఆటతీరును పాకిస్థాన్‌ క్రికెటర్లు కుళ్లుకుంటున్నారు. టీమిండియా ప్లేయర్లపై పనికి మాలిన ఆరోపణలు చేస్తున్నారు. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా సెమీఫైనల్‌కు చేరుకుంది. దీనికి తోడు అఫ్ఘానిస్థాన్ కూడా సెమీఫైనల్‌కు వెళ్లడంతో పాకిస్థాన్‌ క్రికెటర్లు రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు భారత్‌పై అనవసర ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. పాకిస్థానీ టీవీ ఛానెల్‌లో చర్చాగోష్టిలో కూర్చున్న ఇంజమామ్ ఉల్ హక్ భారత ప్లేయర్లపై సంచలన ఆరోపణలు చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత బౌలర్లు బాల్‌ ట్యాంపరింగ్‌ పాల్పడినట్లు ఆరోపించాడు. దీనికి ఇదే చర్చలో కూర్చున్న మరో పాక్ క్రికెటర సలీం మాలిక్ కూడా వంత పాడాడు.

పాకిస్థాన్‌కు చెందిన స్పోర్ట్స్ 24 న్యూస్ ఛానెల్‌లో జరిగిన కార్యక్రమంలో ఇంజమామ్-ఉల్-హక్, సలీం మాలిక్ ప్రపంచకప్ లో టీమ్ ఇండియా మోసం చేసిందని ఆరోపించారు. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ లో ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ అందుకున్న రివర్స్ స్వింగ్‌పై ఇంజమామ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. 15వ ఓవర్‌లో అర్ష్‌దీప్‌ వేసిన బంతికి రివర్స్‌ స్వింగ్‌ తో సత్తా చాటడంపై అనుమనం వ్యక్తం చేశాడీ మాజీ ప్లేర్. టీమ్‌ఇండియా బంతితో ఏమైనా చేసిందా లేదా అని అంపైర్లు బంతిని తనిఖీ చేయాలన్నాడు. ఇక మరో పాక్ క్రికెటర్ సలీమ్ మాలిక్ మాట్లాడుతూ ‘బాల్ చెకింగ్ లాంటివి మా కోసం. భారత్‌తో పాటు మరికొన్ని జట్లకు దీని నుంచి మినహాయింపు ఉంది’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు.

ఇవి కూడా చదవండి

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌, ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్‌ సెమీఫైనల్‌కు చేరాయి. ఇంగ్లండ్‌తో భారత్‌ తలపడనుంది. దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ మధ్యమరో సెమీస్ మ్యాచ్ జరగనుంది. ఇప్పుడు ఈ నాలుగు జట్లలో ఏ జట్టు టైటిల్‌ గెలుస్తుందోనన్న ఆసక్తి పెరిగింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..