IPL 2025 SRH: అందరూ కాటేరమ్మ కొడుకులే! వామ్మో ఈ టీమ్‌ ఏంటి భయ్యా..!

సన్‌రైజర్స్ హైదరాబాద్ IPL 2025లో అగ్రెసివ్ బ్యాటింగ్‌తో అదరగొట్టేందుకు సిద్ధమవుతోంది. ఇషాన్ కిషన్‌ రాకతో బ్యాటింగ్ లైన్‌అప్ మరింత బలపడింది. బౌలింగ్‌లోనూ షమీ, పటేల్ వంటి ప్రముఖ బౌలర్లు ఉన్నారు. అయితే, అతిగా ఆక్రమణాత్మక వ్యూహం ప్రమాదకరమైనదని జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. హైదరాబాద్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం.

IPL 2025 SRH: అందరూ కాటేరమ్మ కొడుకులే! వామ్మో ఈ టీమ్‌ ఏంటి భయ్యా..!
Srh Team

Updated on: Mar 19, 2025 | 6:13 AM

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. గత ఐపీఎల్‌ సీజన్‌లో ఎలాంటి సునామీ సృష్టించిందో మీ అందరికీ తెలిసిందే. టీ20 బ్రాండ్‌ ఆఫ్‌ క్రికెట్‌ను నెక్ట్స్‌ లెవెల్‌కు తీసుకెళ్లారు. పిచ్చికొట్టుడుకి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయింది ఎస్‌ఆర్‌హెచ్‌. ఆ బ్యాటింగ్ సునామీలో దాదాపు అన్ని టీమ్స్‌ కొట్టుకుపోయాయి. కానీ, ఒక్క ఫైనల్‌లోనే ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్‌ డల్‌ అవ్వడంతో కప్పు దూరమైంది. కానీ, ఈ సారి సీజన్‌లో అలాంటి తప్పులేం జరగకుండా.. డబుల్‌ ఎనర్జీతో జట్టు మొత్తం కాటేరమ్మ కొడుకులతో వచ్చేస్తోంది కావ్య మారన్‌. మరి ఈ సారి ఐపీఎల్‌ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్‌ బలమేంటి? బలహీనతేంటి? గత సీజన్‌లా బ్యాటింగ్‌ స్ట్రాంగ్‌గా ఉందా? బౌలింగ్‌ మెరుగుపడిందా? ఇలా ఇంట్రెస్టింగ్‌ విషయాను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. మిగతా అన్నీ సీజన్లకు భిన్నంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌ 2024లో చాలా డిఫరెంట్‌ అప్రోచ్‌తో ఆడింది.

ఎటాకింగ్‌ గేమ్‌తో ఏ జట్టు ఎదురైనా బ్యాట్‌తో విరుచుకుపడటమే ఫస్ట్‌ ఆప్షన్‌గా చెలరేగిపోయింది. ఆ స్ట్రాటజీ వారికి అద్భుతంగా కలిసి వచ్చింది. భారీ భారీ స్కోర్లు, పవర్‌ ప్లేలోనే 100కి పైగా స్కోర్లు చేస్తూ ప్రత్యర్థి జట్ల మైండ్‌ బ్లాంక్‌ అయ్యేలా చేసింది. అసలేం జరుగుతుందో వాళ్లుకు అర్థమయ్యేలోపే స్కోర్‌ బోర్డ్‌పై కొండంత టార్గెట్‌ ఉండేది. విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్టును మానసికంగా దెబ్బ కొట్టి ఆ తర్వాత మ్యాచ్‌ గెలిచేవాళ్లు ఆరెంజ్‌ ఆర్మీ. ఇప్పుడు ఐపీఎల్‌ 2025లోనూ ఇదే స్ట్రాటజీని అమలు చేయనుంది. ఎందుకంటే.. గత సీజన్‌లో అదరగొట్టిన వాళ్లు కోర్‌ టీమ్‌ను అంటిపెట్టుకున్న ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం.. ఐపీఎల్‌ 2025 మెగా వేలంలో ఆ టీమ్‌ను మరింత స్ట్రెంతెన్‌ చేసింది. అప్పటికే అభిషేక్‌ శర్మ, ట్రావిస్‌ హెడ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, నితీష్‌ కుమార్‌ రెడ్డితో బ్యాటింగ్‌ లైనప్‌ భీకరంగా ఉంటే ఈ సారి వన్‌డౌన్‌లో ఆడించేందుకు మరో ప్యాకెట్‌ డైనమైట్‌ను జట్టులోకి తీసుకున్నాడు.

టీమిండియా యంగ్‌ క్రికెటర్‌, గతంలో ముంబైకి ఆడుతూ అదరగొట్టిన ఇషాన్‌ కిషన్‌కు భారీ ధర చెల్లించి.. ఎస్‌ఆర్‌హెచ్‌ మెగా వేలంలో అతన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇషాన్‌ కిషన్‌ రాకతో సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ లైనప్‌ శత్రుదుర్భేధ్యంగా మారిపోయింది. ఒక్కసారి వాళ్ల బ్యాటింగ్‌ లైనప్‌ చూస్తూ.. వామ్మో ఇదేం బ్యాటింగ్‌ లైనప్‌ భయ్యా.. అందరూ కాటేరమ్మ కొడుకుల్లానే ఉన్నారుగా.. ఒక్కడు నిలబడ్డా ఊచకోతేగా అనే రేంజ్‌లో ఉంది. గత సీజన్‌లోనే సన్‌రైజర్స్‌కు సూపర్‌ టీమ్‌ సెట్‌ అయింది. దాన్ని ఈ సీజన్‌కు మరింత పాలిష్‌ చేసి, చిన్ని చిన్ని లోపాలుంటే వాటిని పూడ్చుకొని.. ఒక అరివీర భయంకరమైన జట్టుతో సన్‌రైజర్స్‌ అయితే ఈ ఐపీఎల్‌ సీజన్‌లో బరిలోకి దిగనుంది. ఎస్‌ఆర్‌హెచ్‌ బలం బ్యాటింగే అని చెప్పడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు.

పెద్ద ప్లేయర్లు.. ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, క్లాసెన్‌, నితీష్‌ కుమార్‌ రెడ్డి కాకుండా.. మన ఇండియన్‌ టాలెంట్‌ అభినవ్‌ మనోహర్‌, సచిన్‌ బేబీ లాంటి వాళ్లు కూడా ఉండటం ఎస్‌ఆర్‌హెచ్‌ను మరింత స్ట్రాంగ్‌ చేస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే.. ఇంత భయంకరమైన బ్యాటింగ్‌ లైనప్‌ మరే టీమ్‌కి లేదుని చెప్పొచ్చు. ఇక బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సూపర్‌ స్ట్రాంగ్‌గా ఉంది. లాస్ట్‌ సీజన్‌లో భారీ భారీ స్కోర్లు చేసినా.. కొన్ని మ్యాచ్‌ల్లో అదే రేంజ్‌లో పరుగులు కూడా సమర్పించుకున్నారు. కానీ, ఈ సీజన్‌లో అలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు మంచి మంచి బౌలర్లను పిక్‌ చేసుకున్నారు. ఎలాగో కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ రూపంలో మంచి ఆల్‌రౌండర్‌ ఉన్నాడు. పైగా వికెట్‌ టేకింగ్‌ బౌలర్‌. అతనితో పాటు ఈ సారి టీమిండియా స్టార్‌ పేసర్‌ మొహమ్మద్‌ షమీ, హర్షల్‌ పటేల్‌, జయ్‌దేవ్‌ ఉనద్కట్‌ కూడా ఉండటం ఎస్‌ఆర్‌హెచ్‌ను ఓ సూపర్‌ పవర్‌గా మార్చింది. వీరితో పాటు ఆడమ్‌ జంపాను టీమ్‌లోకి తీసుకోవడం ద్వారా వికెట్‌ టేకింగ్‌ స్పిన్నర్‌ జట్టులోకి వచ్చారు.

గత సీజన్‌లో ఒక క్వాలిటీ స్పిన్నర్‌ లేని లోటు కాస్త కనిపించింది. కానీ, ఈ సారి అది కూడా ఉండకపోవచ్చు. పైగా రాహుల్‌ చాహర్‌ రూపంలో మరో స్పిన్నర్‌ కూడా ఉన్నాడు. వీరితో పాటు కమిందు మెండిస్‌, వియాన్ ముల్డర్ వంటి ఆల్‌రౌండర్లు కూడా ఉన్నారు. అలాగే జూనియర్‌ మలింగాగా పేరు తెచ్చుకున్న ఇషాన్‌ మలింగా కూడా ఎస్‌ఆర్‌హెచ్‌ టీమ్‌లో ఉన్నాడు. ఇలా వీళ్లందరిని చూస్తుంటే.. అసలు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఎవర్ని తీసుకోవాలో అని కెప్టెన్‌ తల బద్దలుకొట్టుకోవాల్సిందే. మొత్తానికి.. ఏ సీజన్‌లో లేని విధంగా బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ చాలా బ్యాలెన్స్‌డ్‌గా కనిపిస్తోంది. ఇది కదా టీమ్‌ అంటే అనే ఒక ఫీలింగ్‌ కలుగుతోంది. మరి ఇంత మంచి జట్టులో కూడా ఒక మైనస్‌ ఉంది. అదేంటంటే.. ఎస్‌ఆర్‌హెచ్‌ గత సీజన్‌లో ఆడిన కోర్‌ టీమ్‌నే కొసాగిస్తోందనే విషయాన్ని ఆల్రెడీ చెప్పుకున్నాం. అదే టీమ్‌కు యాడ్‌ ఆన్‌ చేసుకున్నారంతే. అయితే.. లాస్ట్‌ సీజన్‌లో ఆడిన అగ్రెసివ్‌ స్ట్రాటజీతోనే వెళ్తే కొన్ని సార్లు సక్సెస్‌ అవ్వొచ్చు, కొన్ని సార్లు ఎదురుదెబ్బలు తగలొచ్చు.

సన్‌రైజర్స్‌ అగ్రెసివ్‌ స్ట్రాటజీ అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటివి. అందుకే ఈ విషయంలోనే వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. గత సీజన్ ఫైనల్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్‌ కోలాప్స్‌ చూశాం. ఈ సారి కూడా ఆరంభంలోనే అలాంటి మ్యాచ్‌లు రెండు పడితే.. ఎస్‌ఆర్‌హెచ్‌ స్ట్రాటజీ విషయంలో పునరాలోచనలో పడే అవకాశం ఉంది. సో.. అగ్రెసివ్‌గా ఆడటం ఎంతో ముఖ్యమో.. కొన్ని సార్లు జాగ్రత్తగా ఆడటం కూడా అంతే ముఖ్యం. ఇక సన్‌రైజర్స్‌ హోం గ్రౌండ్‌ విషయానికి వస్తే.. హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఎలాగో సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ సూపర్‌ స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి పిచ్‌ను వీలైనంత ఎక్కువగా వాడుకోవచ్చు.

ఎట్‌ది సేమ్‌ టైమ్‌.. బౌలింగ్‌లో హర్షల్‌ పటేల్‌ లాంటి బౌలర్‌ను ఈ పిచ్‌పై ఆడటం అంత ఈజీ కాదు. అతను ఎక్కువగా ఛేజ్‌ ఆఫ్‌ ది పేస్‌తో స్లోవర్‌ డెలవరీలు వేస్తూ ఉంటాడు. అందుకోసమే అతన్ని టీమ్‌లోకి తీసుకున్నాడు. సో.. బ్యాటింగ్‌ పిచ్‌పై బ్యాటింగ్‌తో పాటు ఒక మంచి బౌలింగ్‌ ఆప్షన్‌తో కూడా సన్‌రైజర్స్‌ బరిలోకి దిగబోతుంది. ఇక సన్‌రైజర్స్‌ను ఆపడం కష్టమనే చెప్పాలి. ఇక చివరిగా సన్‌రైజర్స్‌ బెస్ట్‌ ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఒక సారి చూస్తే.. అభిషేక్‌ శర్మ, ట్రావిస్‌ హెడ్‌, ఇషాన్‌ కిషన్‌, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, మహ్మద్ షమీ, ఇక అవసరాన్ని బట్టి ఆడమ్‌ జంపాను ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌గా వాడుకునే ఛాన్స్‌ ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.