
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతోన్న టీ20 బ్లాస్ట్‌లో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ అద్భుతమైన బ్యాటింగ్‌తో అలరించాడు. సర్రే తరపున ఆడుతోన్న నరైన్ బంతి(1/42)తో తేలిపోయినా.. బ్యాటింగ్‌లో మాత్రం హాఫ్ సెంచరీతో మెరిశాడు. అతడు 37 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 78 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయితేనేం నరైన్ ఇంతలా బ్యాట్‌తో విజృంభించినా.. తన జట్టును మాత్రం విజయతీరాలకు చేర్చలేకపోయాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే.. సునీల్ నరైన్ మెరుపు అర్ధ శతకం(78)తో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఆ జట్టు ఆటగాళ్లలో విల్ జాక్స్(23), జాసన్ రాయ్(28), జేమీ ఓవర్టన్(23) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లతో రాణించారు. ఇక ఎసెక్స్ బౌలర్లలో సామ్స్, ఆరోన్, కుక్, హర్మర్, స్నేటర్, వాల్టర్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం బరిలోకి దిగిన ఎసెక్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఆ జట్టు బ్యాటర్లు ఫెరోజ్(35 నాటౌట్), లారెన్స్(58), కైల్ పెప్పర్(75) మెరుపు ఇన్నింగ్స్‌లతో రాణించారు. అయితే ఎసెక్స్ జట్టుకు మాత్రం గెలుపు చివరి బంతికి లభించింది. సర్రే బౌలర్ సీన్ అబాట్ బౌలింగ్‌లో ఫెరోజ్ చివరి బంతికి సిక్స్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు.