AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: ఆ ప్రయోగం విఫలమైనా.. మీ నిర్ణయం కరెక్టే గంభీర్.. గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Gavaskar Backs Gambhir - Gills Strategy: వెల్లింగ్టన్ వన్డేలో భారత్ బ్యాటింగ్ ప్రయోగంపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించారు. అక్షర్ పటేల్‌ను కేఎల్ రాహుల్ కంటే ముందు పంపడం సరైన ఆలోచనేనని, బౌలర్లను తికమక పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. కొన్నిసార్లు ఈ ప్రయోగాలు విజయవంతమవుతాయని, మరికొన్నిసార్లు విఫలమవుతాయని వివరించారు.

IND vs NZ: ఆ ప్రయోగం విఫలమైనా.. మీ నిర్ణయం కరెక్టే గంభీర్.. గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Goutam Gambhir Sunil Gavaskar
Venkata Chari
|

Updated on: Nov 09, 2026 | 12:21 PM

Share

Gavaskar Backs Gambhir – Gills Strategy: వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ డీఎల్ఎస్ పద్ధతిలో నాలుగు వికెట్ల తేడాతో ఉత్కంఠభరిత విజయాన్ని సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో చేసిన ప్రయోగంపై సోషల్ మీడియాలో, క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. 135 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా 39 పరుగులకే శుభమాన్ గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి కీలక బ్యాటర్ల వికెట్లను కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఈ సమయంలో, అప్పటికి ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్ కంటే ముందుగా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను ఐదవ స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం అభిమానులను, అలాగే క్రికెట్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేసింది.

అయితే, అక్షర్ పటేల్ కేవలం ఏడు పరుగులకే అవుట్ కావడంతో భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 47 పరుగులతో మరింత సంకట స్థితిలో పడింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభమాన్ గిల్ తీసుకున్న ఈ ప్రయోగాత్మక నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయానికి మద్దతుగా నిలిచారు.

ఎక్కువమంది చదివినది: 109 పరుగులే టార్గెట్.. 7 వికెట్లు పడినా భారత్ ఎలా గెలిచింది.. డీఎల్‌ఎస్ మెథడ్ పూర్తి లెక్క ఇదే..!

ఇవి కూడా చదవండి

సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ కాంప్లిమెంటరీ షోలో గవాస్కర్ ఈ విషయంపై స్పందించారు. క్రీజ్‌లో ఒక లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ వస్తే, బౌలర్లు తమ లైన్ అండ్ లెంగ్త్‌ను మార్చుకోవాల్సిన అవసరం వస్తుందని ఆయన వివరించారు. బౌలింగ్ దిశను మార్చే ఈ ప్రక్రియలో రైట్ హ్యాండ్ బ్యాటర్లకు కూడా పరుగులు చేసే అవకాశం లభిస్తుందని గవాస్కర్ పేర్కొన్నారు. ఈ థాట్ ప్రాసెస్‌లో ఎలాంటి తప్పు లేదని ఆయన స్పష్టం చేశారు. “అక్షర్ గనుక రన్స్ చేసి ఉంటే, కెప్టెన్సీ ఎంత బాగుందో అని పొగిడేవారు” అని గవాస్కర్ అన్నారు. ఇటువంటి ప్రయోగాలు కొన్నిసార్లు విజయవంతమవుతాయని, మరికొన్నిసార్లు విఫలమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈసారి న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ప్రయోగం వర్కౌట్ అవ్వలేదని తెలిపారు.

అంతేకాకుండా, అక్షర్ పటేల్ తర్వాత కేఎల్ రాహుల్ లాంటి పటిష్టమైన బ్యాటర్ ఇంకా బ్యాటింగ్‌కు సిద్ధంగా ఉన్నాడనే ధైర్యంతోనే ఈ ప్రయోగాన్ని చేశారని సునీల్ గవాస్కర్ వెల్లడించారు. ఒత్తిడితో కూడిన సమయాల్లో అక్షర్ పటేల్‌ను పై స్థానంలో పంపడం ఇదేం మొదటిసారి కాదని ఆయన గుర్తుచేశారు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో వికెట్లు పడుతున్న వేళ అక్షర్ పటేల్, విరాట్ కోహ్లీతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టాడు. అలాగే, భారత్ గెలుచుకున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీలోనూ అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ కంటే ముందే ఐదో స్థానంలో బ్యాటింగ్ చేశాడు.

ఎక్కువమంది చదివినది: SRH Retention List: కమిన్స్‌కు కావ్య మారన్ షాక్.. హైదరాబాద్ నుంచి ఆ 8 మంది ఔట్?

కానీ, ఈసారి న్యూజిలాండ్‌లో జరిగిన వన్డేలో ఆ ప్రయోగం విఫలమైంది. అందుకే గవాస్కర్, ఒక్కొక్కసారి ప్రయోగాలు సక్సెస్ అయినా మరోసారి విఫలమవుతాయని, కాబట్టి దీనిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఒక ప్రయోగం విఫలమైనంత మాత్రాన ఆ నిర్ణయం వెనుక ఉన్న ఆలోచనను తప్పు పట్టలేమని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us