
INDW vs SL-W, Asian Games Gold Medal Final Highlights in Telugu: మంగళవారం జరిగిన ఫైనల్‌లో శ్రీలంకను 147 పరుగుల తేడాతో ఓడించి, భారత మహిళల క్రికెట్ జట్టు వరుసగా రెండోసారి ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుని, 3 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఆసియా క్రీడల్లో భారత మహిళల జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే. 217 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక 15.4 ఓవర్లలో 69 పరుగులకే ఆలౌట్ అయింది.
మంగళవారం జరిగిన ఫైనల్‌లో శ్రీలంకను 147 పరుగుల తేడాతో ఓడించి, భారత మహిళల క్రికెట్ జట్టు వరుసగా రెండోసారి ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.
టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుని, 3 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఆసియా క్రీడల్లో భారత మహిళల జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే. 217 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక 15.4 ఓవర్లలో 69 పరుగులకే ఆలౌట్ అయింది.
లంక టీం 14.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది.
శ్రీలంక జట్టు 13.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది.
13 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక జట్టు 7 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది.
శ్రీ చరణి (Shree Charani) ఈ మ్యాచ్‌లో తన రెండో వికెట్‌ను పడగొట్టింది. స్వర్ణ పతక పోరులో శ్రీలంక జట్టు భారీ ఓటమి అంచున నిలిచింది.
శ్రీలంక జట్టు 9.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 49 పరుగులు సాధించింది.
తెలుగు అమ్మాయి శ్రీచరణి తన తొలి వికెట్ పడగొట్టింది. ఈక్రమంలో లంక జట్టు 8.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది.
శ్రేయాంక బౌలింగ్ లంక టీం 4వ వికెట్ కోల్పోయింది. దీంతో ప్రస్తుతం 7.3 ఓవర్లలో లంక జట్టు 44 పరుగులు చేసింది.
దీప్తీ శర్మ తన ఖాతాలో తొలి వికెట్ వేసుకుంది. దీంతో శ్రీలంక జట్టు 3 వ వికెట్ కోల్పోయింది.
షెఫాలీ వర్మ తన రెండు ఓవర్లలో రెండో వికెట్ పడగొట్టింది. దీంతో శ్రీలంక టీం 5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 31 పరుగులు చేసింది.
షెఫాలీ తన తొలి ఓవర్లోనే భారత జట్టుకు బ్రేక్ ఇచ్చింది. దీంతో శ్రీలంక 3 ఓవర్లకే ఒక వికెట్ కోల్పోయి 22 పరుగులు చేసింది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. దీంతో శ్రీలంక ముందు భారీ టార్గెట్ నిలిచింది.
లంక బౌలర్ సుగంధిక కుమారి (Sugandika Kumari) అత్యంత కీలకమైన వికెట్‌ను పడగొట్టింది. తృటిలో అరుదైన సెంచరీ అవకాశాన్ని మంధాన కోల్పోయింది. రౌండ్ ది వికెట్ నుంచి లెగ్ స్టంప్ వైపు వేగంగా వచ్చిన లెంగ్త్ బంతిని మంధాన క్రాస్ లైన్‌పై భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించింది. భారత్ మూడో వికెట్ కోల్పోగా, స్మృతి మంధాన (Smriti Mandhana) 79 పరుగులు చేసి పెవిలియన్ చేరింది.
భారత జట్టు 16వ ఓవర్లో 150 పరుగుల మార్క్‌ని దాటింది. మంధాన 70+ పరుగులతో క్రీజులో నిలిచింది.
హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) లాంగ్ ఆఫ్ దిశగా షాట్ ఆడగా బౌండరీ లైన్ వద్ద క్యాచ్‌గా మారింది. స్టంప్ వెలుపల పడిన బంతిని కొద్దిగా గాల్లోకి విసిరినట్లుగా సంధించగా అది బయటకు టర్న్ అయింది. కౌర్ క్రీజులో వెనక్కి, అటుగా కదులుతూ లాంగ్ ఆఫ్ ఫెన్స్ మీదుగా బంతిని భారీ షాట్ బాదేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో ఆమె చేతిలో బ్యాట్ తిరిగింది. దీంతో బంతి సరిగ్గా బ్యాట్‌కు తగలక ఎదురుగా ఉన్న ప్రత్యర్థి జట్టు కెప్టెన్ చేతికి చిక్కింది.
13 ఓవర్ల తర్వాత భారత జట్టు ఒక వికెట్ నష్టానికి 123 పరుగులు చేసింది. స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ క్రీజులో ఉన్నారు. మంధాన అంతర్జాతీయ క్రికెట్లో 11,000 పరుగులు పూర్తి చేసుకుంది. షెఫాలీ వర్మ 48 పరుగులకు ఔటయింది.
షెఫాలీ వర్మ 48 పరుగుల వద్ద భారీ షాట్ ఆడబోయి పెవిలియన్ చేరింది. దీంతో భారత్ 10 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 99 పరుగులు చేసింది.
మంధాన కేవలం 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ఆసియా గేమ్స్ ఫైనల్‌లో సత్తా చాటింది.
5 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు వికెట్ నష్టపోకుండా 59 పరుగులు చేసింది. మంధాన 36, షెఫాలీ 23 పరుగులతో నిలిచారు.
భారత మహిళల క్రికెట్ జట్టు (India Women) స్టార్ బ్యాటర్లు అంతర్జాతీయ టీ20 చరిత్రలో మునుపెన్నడూ లేని రికార్డును నమోదు చేశారు. ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగుతూ వచ్చిన షఫాలీ వర్మ (Shafali Verma), స్మృతి మంధాన (Smriti Mandhana) జంట అద్భుతమైన భాగస్వామ్యంతో ఈ మైలురాయిని అందుకున్నారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
3 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 29 పరుగులు చేసింది. మంధాన 20, షెఫాలీ 9 పరుగులు చేసింది
233 – ఇంగ్లాండ్, ఇండియా*
213 – ఆస్ట్రేలియా
206 – వెస్ట్ ఇండీస్
205 – పాకిస్తాన్
204 – న్యూజిలాండ్
ఇమేషా దులానీ, చమరి అతపత్తు(కెప్టెన్), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, హన్సిమా కరుణరత్నే, కౌషని న్యూత్యాంగన(కీపర్), మిథాలీ అయోధ్య, కావ్య కావింది, చాముది ప్రబోద, సుగండిక కుమారి.
గోల్డ్ కోసం జరుగుతోన్న ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
ఇప్పటివరకు ఇక్కడ 11 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో ఆరు మ్యాచ్‌లను బ్యాటింగ్ జట్టు గెలుచుకోగా, ఐదు మ్యాచ్‌లను ఛేజింగ్ జట్టు గెలుచుకుంది. తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 135 కాగా, రెండో ఇన్నింగ్స్ సగటు స్కోరు 87గా ఉంది.
ఫైనల్ మ్యాచ్ కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో జరుగుతుంది. ఇది ఒక కొత్త క్రికెట్ మైదానం, గతంలో దీనిని బేస్‌బాల్ మైదానంగా ఉపయోగించారు. దీని నిర్మాణం మార్చి 2026లో పూర్తయింది. ఇక్కడ హైబ్రిడ్ పిచ్‌ను ఏర్పాటు చేశారు. అతి చిన్న బౌండరీ సుమారు 65 మీటర్లు ఉంటుంది.
ఫైనల్‌లో వాతావరణం కీలక పాత్ర పోషించవచ్చు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయి, రిజర్వ్ డే నిర్వహించడం సాధ్యం కాకపోతే, నిబంధనల ప్రకారం అధిక సీడింగ్ ఉన్న జట్టుకు స్వర్ణ పతకాన్ని అందజేస్తారు. అందుబాటులో ఉన్న టోర్నమెంట్ సమాచారం ప్రకారం, ఈ పరిస్థితిలో భారత్‌కు అనుకూలత ఉంది.
పురుషుల క్రికెట్ చరిత్రలో తొలిసారిగా భారత్, జపాన్‌ల మధ్య అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది. సుజుకి కప్ అని పిలవబడే ఈ ఏకైక టీ20 మ్యాచ్, జపాన్‌లోని సానో అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో మంగళవారం ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. జపాన్‌లో భారత్‌కు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కూడా.
ఇరు దేశాల మధ్య ఇప్పటివరకు 32 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగాయి. భారత్ 26 మ్యాచ్‌లు గెలవగా, శ్రీలంక ఐదు మ్యాచ్‌లు గెలిచింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. శ్రీలంకపై జరిగిన చివరి ఏడు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో భారత్ విజయం సాధించింది.
భారత్ క్వార్టర్ ఫైనల్స్‌లో జపాన్‌ను 8 వికెట్ల తేడాతో, సెమీ ఫైనల్స్‌లో బంగ్లాదేశ్‌ను 114 పరుగుల తేడాతో ఓడించింది. శ్రీలంక క్వార్టర్ ఫైనల్స్‌లో మలేషియాను 86 పరుగుల తేడాతో, సెమీ ఫైనల్స్‌లో పాకిస్థాన్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది.
ఆసియా క్రీడల స్వర్ణ పతకం కోసం భారత, శ్రీలంక మహిళల క్రికెట్ జట్లు మంగళవారం తలపడనున్నాయి. నిస్షిన్‌లోని కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో ఉదయం 10:30 గంటలకు ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. 2023 హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో శ్రీలంకను ఓడించి భారత్ విజయం సాధించింది.