24 బంతుల్లో 76 పరుగులు.. ఒకే ఒక్క డాట్ బాల్.. ఐపీఎల్ హిస్టరీలోనే చెత్త రికార్డ్.. ఒక్క మ్యాచ్‌తో 12 కోట్లు పాయే

ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఐపీఎల్ 2025 ఓపెనర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన స్పెల్‌ను నమోదు చేశాడు. దీంతో రాజస్థాన్ ఐపీఎల్ వేలంలో ఖర్చు చేసిన రూ. 12 కోట్లు బూడిరలో పోసిన పన్నీరులా మారిందంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

24 బంతుల్లో 76 పరుగులు.. ఒకే ఒక్క డాట్ బాల్.. ఐపీఎల్ హిస్టరీలోనే చెత్త రికార్డ్.. ఒక్క మ్యాచ్‌తో 12 కోట్లు పాయే
Jofra Archer Has Bowled The Most Expensive Spell In Ipl History

Updated on: Mar 23, 2025 | 6:21 PM

ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతోన్న ఐపీఎల్ 2025 ఓపెనర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డులో చేరాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ల దెబ్బకు ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత ఖరీదైన స్పెల్‌ను నమోదు చేశాడు.

హైదరాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్చర్ నాలుగు ఓవర్లు వేసి 76 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఇవి కూడా చదవండి

దీంతో ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ టైటాన్స్ తరపున 73 పరుగులు ఇచ్చిన మోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు.

పవర్ ప్లేలో ట్రావిస్ హెడ్ ఊచకోతకు ఒకే ఓవర్లో 23 పరుగులతో ఆర్చర్ బ్యాడ్ డే మొదలైంది. ఇందులో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.

ఆ తర్వాత ఇషాన్ కిషన్ తన మూడో ఓవర్లో ఆర్చర్‌ బౌలింగ్‌లో మూడు సిక్సర్లు బాదాడు. ఈ కుడిచేతి వాటం బౌలర్ తన చివరి ఓవర్‌లో ఐదు ఫోర్లు ఇచ్చి, నో బాల్‌తో పాటు నాలుగు బైలు కూడా సమర్పించుకున్నాడు.

ఒక IPL ఇన్నింగ్స్‌లో ఓ బౌలర్ ఇచ్చిన అత్యధిక పరుగులు..

1. జోఫ్రా ఆర్చర్ (RR) – 76 vs SRH (2025)

2. మోహిత్ శర్మ (GT) – 73 vs DC (2024)

3. బాసిల్ థంపి (SRH) – 70 vs RCB (2018)

4. యష్ దయాళ్ (GT) – 69 vs KKR (2023)

5. రీస్ టోప్లీ (RCB) – 68 vs SRH (2024).

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..