ODI Records: ఇదెక్కడి ఊరమాస్ కొట్టుడు భయ్యా.. ఏకంగా 50 ఏళ్ల రికార్డ్‌కే మెంటలెక్కించావ్..

Updated on: Feb 14, 2025 | 10:00 AM

Pakistan vs South Africa: కరాచీలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా తరపున మాథ్యూ బ్రీట్జ్కే 83 పరుగులు చేశాడు. ఈ అర్ధ సెంచరీ సహాయంతో దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 352 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని 49 ఓవర్లలోనే ఛేదించిన పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమి ఉన్నప్పటికీ, మాథ్యూ బ్రీట్జ్కే ఈ మ్యాచ్ ద్వారా ఒక ప్రత్యేక ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.

1 / 5
Pakistan vs South Africa: తన తొలి వన్డేలోనే 150 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ మాథ్యూ బ్రీట్జ్కే.. ఇప్పుడు మరో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. విశేషమేమిటంటే 50 ఏళ్ల నాటి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.

2 / 5
బుధవారం (ఫిబ్రవరి 12) కరాచీలో పాకిస్థాన్‌తో జరిగిన వన్డేలో మూడో స్థానంలో మైదానంలోకి వచ్చిన మాథ్యూ బ్రీట్జ్కే 84 బంతుల్లో 1 సిక్స్, 10 ఫోర్లతో 83 పరుగులు చేశాడు. అంతకుముందు న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మాథ్యూ 148 బంతుల్లో 150 పరుగులు చేశాడు.

3 / 5
ఈ రెండు ఇన్నింగ్స్‌లలో మాథ్యూ బ్రీట్జ్కే మొత్తం 233 పరుగులు చేశాడు. దీనితో, అతను వన్డే క్రికెట్ చరిత్రలో మొదటి రెండు మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ అరుదైన రికార్డు వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ పేరిట ఉండేది.

4 / 5
1975లో వెస్టిండీస్ తరపున వన్డేల్లో అరంగేట్రం చేసిన డెస్మండ్ హేన్స్ తన మొదటి రెండు మ్యాచ్‌ల్లో మొత్తం 195 పరుగులు చేశాడు. దీంతో, వన్డే క్రికెట్ చరిత్రలో మొదటి రెండు ఇన్నింగ్స్‌లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.

5 / 5
ఇప్పుడు, మాథ్యూ బ్రీట్జ్కే తన తొలి మ్యాచ్‌లో సెంచరీ, రెండవ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించడం ద్వారా ఈ రికార్డును చెరిపేశాడు. బ్రెయిట్జ్కే తన మొదటి రెండు మ్యాచ్‌లలో వన్డే క్రికెట్‌లో 200+ పరుగులు సాధించిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మన్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు.