Shubman Gill: గౌహతిలో గిల్ విధ్వంసం.. బ్యాక్ టు బ్యాక్ సెంచరీతో విరుచుకుపడ్డ భారత కెప్టెన్

Shubman Gill: గౌహతి‎ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీతో చెలరేగారు. 406 పరుగుల భారీ కొండంత లక్ష్య ఛేదనలో కేవలం 63 బంతుల్లోనే 10 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ సాధించి భారత జట్టును విజయ తీరాల వైపు నడిపిస్తున్నారు.

Shubman Gill: గౌహతిలో గిల్ విధ్వంసం.. బ్యాక్ టు బ్యాక్ సెంచరీతో విరుచుకుపడ్డ భారత కెప్టెన్
Shubman Gill (1)

Updated on: Sep 30, 2026 | 8:29 PM

Shubman Gill: భారత్, వెస్టిండీస్ మధ్య గౌహతి‎లోని బర్సాపారా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన సెంచరీతో విశ్వరూపం చూపించారు. తొలి వన్డేలో 110 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించిన గిల్, ఈ మ్యాచ్‌లో ఏకంగా 406 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో మరోసారి సెంచరీ బాది కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడారు. ప్రత్యర్థి బౌలర్లు వేసిన ప్రతి బంతిని మైదానం నలుమూలలా తరలిస్తూ కేవలం 63 బంతుల్లోనే 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో తన వన్డే కెరీర్‌లో 10వ సెంచరీ పూర్తి చేసుకున్నారు.

 

హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ రికార్డుల వేట

రెండో వైపు నుంచి భారత మాజీ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ కూడా వెస్ట్ ఇండీస్ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన రోహిత్ శర్మ కేవలం 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఈ ఇన్నింగ్స్ క్రమంలో రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో 12,000 పరుగుల మైలురాయిని దాటి సరికొత్త రికార్డు సృష్టించారు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ తర్వాత వన్డేల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగులు సాధించిన మూడో భారత బ్యాటర్‌గా రోహిత్ శర్మ చరిత్రకెక్కారు.

మొదటి వికెట్‌కే భారీ భాగస్వామ్యం

మొదట బ్యాటింగ్ చేసిన వెస్ట్ ఇండీస్ జట్టు ఒకే ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీలు సాధించి 50 ఓవర్లలో 405 పరుగుల భారీ స్కోరు నిర్మించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, అంతటి కొండంత లక్ష్యాన్ని చూసి బెదిరిపోకుండా భారత ఓపెనర్లు గిల్, రోహిత్‌‌లు ఇన్నింగ్స్ మొదటి ఓవర్ నుంచే టి20 మోడ్‌లో ఆడారు. మొదటి ఓవర్ల పవర్ ప్లేలోనే బౌండరీల వర్షం కురిపిస్తూ విండీస్ పేసర్లు ఆల్జారీ జోసెఫ్, జేడెన్ సీల్స్ వ్యూహాలను తిప్పికొట్టారు. గిల్, రోహిత్ జోడీ మొదటి వికెట్‌కే రికార్డు స్థాయిలో పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పారు.

సరికొత్త చరిత్ర వైపు భారత్

వెస్ట్ ఇండీస్ నిర్దేశించిన 406 పరుగుల లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు వేసిన ఈ బలమైన పునాదితో మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. మైదానంలో గిల్ చూపిస్తున్న షాట్ల మెరుపులు, రోహిత్ ఇస్తున్న సహకారంతో భారత్ భారీ సగటుతో పరుగులు రాబడుతోంది. ఈ మ్యాచ్‌ను గనక భారత్ ఛేజింగ్ పూర్తి చేసి గెలిస్తే, వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత భారీ ఛేజింగ్ సాధించిన జట్టుగా టీమిండియా సరికొత్త రికార్డు నమోదు చేస్తుంది. ప్రసుతం క్రీజులో ఉన్న వీరిద్దరి బ్యాటింగ్ దాటి చూస్తుంటే భారత్ సిరీస్‌‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సొంతం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us