Sanju Samson : 21 సార్లు డకౌట్ అయితేనే తీసేస్తా.. గంభీర్ మాటతో మారిపోయిన సంజూ శాంసన్ కెరీర్

టీమిండియా స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ కెరీర్ ఒక సమయంలో గందరగోళంలో పడింది. అతనికి అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఎక్కువ అవకాశాలు రాలేదు. కానీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన భరోసాతో సంజూ కెరీర్ మలుపు తిరిగింది. "21 సార్లు డకౌట్ అయినా నిన్ను జట్టు నుంచి తీసేయను" అని గంభీర్ చెప్పిన మాటలు సంజూలో ధైర్యం నింపాయి.

Sanju Samson : 21 సార్లు డకౌట్ అయితేనే తీసేస్తా.. గంభీర్ మాటతో మారిపోయిన సంజూ శాంసన్ కెరీర్
Gautam Gambhir

Updated on: Aug 10, 2025 | 11:53 AM

Sanju Samson : టీ20 క్రికెట్‌లో మూడు సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ ఒకప్పుడు తన కెరీర్లో చాలా ఒడిదుడుకులు ఎదురుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. 2023 జనవరి నుంచి 2024 జనవరి వరకు కేవలం 6 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 2024 టీ20 వరల్డ్ కప్‌లో చోటు ఆశించినా, రిషబ్ పంత్‌ను ఎంపిక చేయడంతో నిరాశకు గురయ్యాడు. కానీ, టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్ వచ్చాక అతని కెరీర్ కొత్త మలుపు తిరిగింది. గంభీర్ ఇచ్చిన భరోసా గురించి సంజూ శాంసన్ తాజాగా ఒక కీలక విషయాన్ని వెల్లడించారు.

టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, గౌతమ్ గంభీర్ గురించి ఇలా అన్నారు.. నేను ఆంధ్రాలో దులీప్ ట్రోఫీ మ్యాచ్ ఆడుతున్నప్పుడు, సూర్యకుమార్ యాదవ్ కూడా అక్కడ ఉన్నారు. మ్యాచ్ తర్వాత అతను నా దగ్గరకు వచ్చి సంజూ నీకు ఒక మంచి అవకాశం రాబోతోంది. మనకు 7 మ్యాచ్‌లు ఉన్నాయి. నేను నీకు అన్ని మ్యాచ్‌లలో ఓపెనర్‌గా అవకాశం ఇస్తాను అని చెప్పారు. అది విని నేను చాలా సంతోషపడ్డాను.

నేను శ్రీలంకతో రెండు మ్యాచ్‌లు ఆడి, రెండింట్లోనూ సున్నాకే అవుట్ అయ్యాను. నేను చాలా నిరాశపడ్డాను. అప్పుడు గంభీర్ భాయ్ నా దగ్గరకు వచ్చి.. ఏం జరిగింది? అని అడిగారు. నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాను అని చెప్పాను. దానికి గంభీర్ నువ్వు 21 సార్లు డకౌట్ అయితేనే నేను నిన్ను జట్టు నుంచి తీసేస్తాను అని భరోసా ఇచ్చారు. ఈ మాటలు తనకు ఎంత నమ్మకాన్ని ఇచ్చాయో సంజూ వివరించారు.

గంభీర్, సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన నమ్మకంతో సంజూ శాంసన్ తన ఆటను మెరుగుపరుచుకున్నాడు. ఆ తర్వాత ఆడిన 7 మ్యాచ్‌లలో మూడు సెంచరీలు సాధించాడు, వాటిలో రెండు విదేశీ గడ్డపై సాధించాడు. టీ20లలో పునరాగమనం తర్వాత అతనికంటే ఎక్కువ పరుగులు ఎవరూ చేయలేదు. ఇది సూర్యకుమార్ మరియు గంభీర్ మద్దతు వల్లే సాధ్యమైందని సంజూ అన్నారు. ఇప్పటివరకు సంజూ శాంసన్ 42 టీ20 మ్యాచ్‌లలో 25.32 సగటుతో 861 పరుగులు చేశారు, ఇందులో 3 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు ఉన్నాయి. వన్డేలలో 16 మ్యాచ్‌లలో 56.66 సగటుతో 510 పరుగులు చేశారు.

జులై 10, 2024 తర్వాత అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాట్స్‌మెన్‌లు

సంజూ శాంసన్: 16 ఇన్నింగ్స్‌లలో 486 పరుగులు (3 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ)

అభిషేక్ శర్మ: 14 ఇన్నింగ్స్‌లలో 435 పరుగులు (1 సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు)

తిలక్ వర్మ: 9 ఇన్నింగ్స్‌లలో 413 పరుగులు (2 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ)

హార్దిక్ పాండ్యా: 13 ఇన్నింగ్స్‌లలో 320 పరుగులు (1 హాఫ్ సెంచరీ)

సూర్యకుమార్ యాదవ్: 14 ఇన్నింగ్స్‌లలో 258 పరుగులు (2 హాఫ్ సెంచరీలు)

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..