Sanjog Gupta: ప్రపంచ క్రికెట్ పగ్గాలు భారతీయుడికి.. ఐసీసీ కొత్త సీఈఓగా జియోస్టార్ అధిపతి సంజోగ్ గుప్తా

ఐసీసీ కొత్త సీఈఓగా సంజోగ్ గుప్తా నియమితులయ్యారు. సోమవారం ఆయన దుబాయ్‌లోని ఐసీసీ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఐసీసీ చరిత్రలో ఈ పదవిని చేపట్టిన ఏడో వ్యక్తి సంజోగ్. ప్రపంచ క్రికెట్‌ను పరివర్తనాత్మక భవిష్యత్తు వైపు నడిపించేందుకు సంజోగ్ గుప్తాకు స్వాగతం పలుకుతున్నట్లు ఐసీసీప్రకటనలో పేర్కొంది.

Sanjog Gupta: ప్రపంచ క్రికెట్ పగ్గాలు భారతీయుడికి.. ఐసీసీ కొత్త సీఈఓగా జియోస్టార్ అధిపతి సంజోగ్ గుప్తా
Sanjog Gupta

Updated on: Jul 07, 2025 | 4:56 PM

Sanjog Gupta: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) సంజోగ్ గుప్తాను తమ కొత్త సీఈఓగా నియమించింది. సోమవారం ఆయన దుబాయ్‌లోని ఐసీసీ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఐసీసీ హిస్టరీలో ఈ పదవిని చేపట్టిన ఏడో వ్యక్తిగా ఆయన నిలిచారు. సంజోగ్ గుప్తా ఇంతకు ముందు జియోస్టార్ స్పోర్ట్స్, లైవ్ ఎక్స్‌పీరియన్స్ విభాగం సీఈఓగా ఉన్నారు. ఈ కీలక పరిణామంలో ఐసీసీ సంజోగ్‌ను తమ వైపునకు తిప్పుకుంది. ఐసీసీకి ఏడవ సీఈఓగా సంజోగ్ గుప్తా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆస్ట్రేలియాకు చెందిన జెఫ్ అలార్డైస్ నాలుగేళ్లు సీఈఓగా పనిచేశారు. జనవరిలో అతను రాజీనామా చేసిన తర్వాత ఆ పదవి ఖాళీగా ఉంది.

ఐసీసీ సీఈఓ స్థానం కోసం 25 దేశాల నుండి 2,500 కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఐసీసీ ఉపాధ్యక్షుడు ఇమ్రాన్ ఖవాజా నేతృత్వంలోని నామినేషన్స్ కమిటీ 12 మంది అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసింది. ఆ తర్వాత సీఈఓ స్థానానికి సంజోగ్ గుప్తా పేరును సిఫార్సు చేశారు. ఐసీసీ ఛైర్మన్ జయ్ షా ఆమోదం తెలిపిన తర్వాత, సంజోగ్‌ను ఐసీసీ సీఈఓగా నియమించారు.

జియోస్టార్‌లో పనిచేసిన సంజోగ్ గుప్తా ఐసీసీకి మరింత ఆదాయాన్ని తీసుకురాగల వ్యాపార నైపుణ్యాన్ని కలిగి ఉన్నందున సీఈఓగా నియమించి ఉండవచ్చు.క్రీడా వ్యూహాలు, కమర్షియలైజేషన్‌లో సంజోగ్ గుప్తాకు అపారమైన అనుభవం ఉంది. ఇది ఐసీసీకి చాలా ఉపయోగపడుతుందని ఐసీసీ ఛైర్మన్ జయ్ షా అన్నారు. మీడియా రంగం నుంచి ఒక వ్యక్తి ఐసీసీకి సీఈఓ కావడం బహుశా ఇదే మొదటిసారి కావొచ్చు. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్ గేమ్స్‌లో క్రికెటును చేర్చడం, క్రికెట్ కమర్షియలైజేషన్ నెక్ట్స్ లెవల్ కు వంటి పరిణామాల నేపథ్యంలో సంజోగ్ గుప్తా ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు స్వీకరించడం గమనార్హం.

హాట్‌స్టార్, జియోల బ్రాడ్‌కాస్టింగ్ వ్యాపారాలు విలీనం అయిన తర్వాత ఏర్పడిన జియోస్టార్ సంస్థ చాలా పెట్టుబడులు పెట్టింది. ఈ సందర్భంలో అది ఇషాన్ ఛటర్జీని సీఈఓగా నియమించింది. ఛటర్జీ యూట్యూబ్ ఇండియా అధిపతిగా ఉండి గతేడాది(2024) జియోస్టార్‌లో చేరారు. ఇప్పుడు అతను సీఈఓగా నియమితులయ్యారు.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ చేయండి..