Team India: భారత్‌కు మంచి పెట్టుబడి..ఆ ఆటగాడిపై శ్రీలంక దిగ్గజం ప్రశంసలు

Team India: భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై శ్రీలంక మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య ప్రశంసలు కురిపించాడు. అతడిని భారత క్రికెట్‌కు మంచి పెట్టుబడిగా అభివర్ణించాడు. అభిషేక్ శర్మ బ్యాటింగ్ సామర్థ్యాన్ని కూడా మెచ్చుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బ్యాటర్ల దూకుడు పెరగడం, బౌలర్లపై ఒత్తిడి వంటి అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు.

Team India: భారత్‌కు మంచి పెట్టుబడి..ఆ ఆటగాడిపై శ్రీలంక దిగ్గజం ప్రశంసలు
Vaibhav Sooryavanshi

Updated on: Oct 31, 2026 | 12:29 PM

Team India: భారత క్రికెట్‌లో యువ ఆటగాళ్ల ప్రతిభపై శ్రీలంక మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ ఆటతీరును ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అతడు భారత క్రికెట్‌కు మంచి పెట్టుబడిగా మారతాడని అభిప్రాయపడ్డాడు. చిన్న వయసులోనే సంచలన ప్రదర్శనలతో వార్తల్లో నిలుస్తున్న వైభవ్‌ను సరైన విధంగా ప్రోత్సహించాలని సూచించాడు. అతడిపై అనవసరమైన ఒత్తిడి పెంచకుండా సహజమైన ఆట ఆడేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పాడు. భారత జట్టులో ప్రతిభ ఉన్న యువ ఆటగాళ్లు చాలామంది ఉన్నారని, వారంతా తమ ఆటతో ఆకట్టుకుంటున్నారని జయసూర్య పేర్కొన్నాడు.

భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆటతీరును కూడా జయసూర్య మెచ్చుకున్నాడు. అతడు దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడని, మైదానంలోని అన్ని వైపులా షాట్లు కొట్టగల కెపాసిటీ ఉందని ప్రశంసించాడు. అభిషేక్ బ్యాటింగ్‌లో ఏ ప్రాంతం అతడికి బలహీనమో చెప్పడం కష్టమని వ్యాఖ్యానించాడు. అతడి షాట్ ఎంపిక, దూకుడు ప్రత్యర్థి బౌలర్లకు సవాలుగా మారుతున్నాయని అభిప్రాయపడ్డాడు. అభిషేక్‌ను ఆల్‌రౌండ్ ప్లేయర్‌గా అభివర్ణించిన జయసూర్య.. భారత జట్టులో అతడితో పాటు మరికొందరు యువ ఆటగాళ్లు కూడా బాగా కష్టపడుతున్నారని తెలిపాడు.

ఇండియన్ సాఫ్ట్‌బాల్ క్రికెట్ లీగ్‌కు చెందిన ముంబయి రాయల్స్, మహారాష్ట్ర సూపర్ స్ట్రైకర్స్ జట్ల జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో జయసూర్య ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా భారత యువ ఆటగాళ్ల ప్రతిభతో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో మారుతున్న ఆటతీరుపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ వంటి యువ ఆటగాళ్లకు సరైన వాతావరణం కల్పిస్తే భవిష్యత్తులో మరింత మెరుగ్గా రాణించే అవకాశం ఉంటుందని చెప్పాడు. యువ క్రికెటర్ల ఎదుగుదలలో ఒత్తిడి తగ్గించి, వారి సహజ ఆటను ప్రోత్సహించడం ముఖ్యమని పరోక్షంగా సూచించాడు.

శ్రీలంక జట్టు ప్రస్తుతం ముక్కోణపు సిరీస్‌లో పాకిస్థాన్‌తో ఫైనల్‌ ఆడేందుకు సిద్ధమవుతోందని జయసూర్య తెలిపాడు. భారత్‌తో జరగబోయే సిరీస్‌కు ముందు ఈ టోర్నీ తమకు మంచి అవకాశమని పేర్కొన్నాడు. ఫైనల్‌లో గెలిచి మరింత ఆత్మవిశ్వాసంతో భారత్‌తో సిరీస్‌లో అడుగుపెట్టాలని భావిస్తున్నట్లు చెప్పాడు. టీమిండియాతో జరిగే పోటీల్లో ఇరు జట్లు నాణ్యమైన క్రికెట్ ఆడతాయని ఆశిస్తున్నట్లు వెల్లడించాడు. భారత్‌తో సిరీస్‌పై తమ జట్టు ఆసక్తిగా ఎదురుచూస్తోందని తెలిపాడు.

ప్రస్తుత పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించడం మంచి పరిణామమని జయసూర్య అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లు ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నారని, భారీ లక్ష్యాలు ఎదురైనా వాటిని ఛేదించేందుకు జట్లు వెనుకాడటం లేదని చెప్పాడు. భారీ స్కోర్లు నమోదవుతున్నా ఛేజింగ్‌లోనూ బ్యాటర్లు అదే దూకుడు కొనసాగిస్తున్నారని వివరించాడు. అయితే ఈ మార్పుతో బౌలర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అంగీకరించాడు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us