SA vs NED: సౌతాఫ్రికకు చుక్కలు చూపించిన నెదర్లాండ్స్‌.. భారీ విజయం.

|

Oct 17, 2023 | 11:11 PM

నెదర్లాండ్స్‌ ఇచ్చిన 246 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడంలో సౌతాఫ్రిక విఫలమైంది. నెదర్లాండ్స్‌ పటిష్టమైన బౌలింగ్ కారణంగా సౌతాఫ్రిక నిర్ణీత ఓవర్లలో 207 పరుగులు మాత్రమే చేసింది. దీంతో నెదర్లాండ్స్‌ 38 పరుగుల తేడాతో అనూహ్య విజయాన్నిఅందుకుంది. ఇక నెదర్లాండ్స్‌ బౌలింగ్ విషయానికొస్తే.. బాస్‌ డే లీడే, రోలోఫ్‌ వాన్‌ డెన్‌ మెర్వే, పాల్‌ వాన్‌ మీకెరెన్‌ చేరెసి రెండు వికెట్లను తీసుకున్నారు. అందరికంటే అధికంగా లోగాన్‌...

SA vs NED: సౌతాఫ్రికకు చుక్కలు చూపించిన నెదర్లాండ్స్‌.. భారీ విజయం.
Netherlands Won The Match
Follow us on

సౌతాఫ్రికా వంటి బలమైన జట్టుకు నెదర్లాండ్స్‌ చుక్కలు చూపించింది. ఐసీసీ వరల్డ్‌ కప్‌2023లో భాగంగా ధర్మశాల వేదికగా జరిగి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ భారీ విజయాన్ని అందుకుంది. సౌతాఫ్రికతో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ తేడాతో విజయాన్ని అందుకుంది. నెదర్లాండ్స్‌ లాంటి టీమ్‌ సౌతాఫ్రికాను చిత్తు చేయడం విశేషం. బ్యాటింగ్‌ మొదలు, బౌలింగ్‌లోనూ టీమ్‌ సమిష్టిగా రాణించడంతో నెదర్లాండ్స్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికా తన తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించగా నెదర్లాండ్స్‌ హ్యాట్రిక్‌ విజయానికి అడ్డుకట్ట వేసింది. ఇక ఈ వరల్డ్‌ కప్‌లో నెదర్లాండ్స్‌ తొలి విజయం ఇదే కావడం విశేషం.

నెదర్లాండ్స్‌ ఇచ్చిన 246 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడంలో సౌతాఫ్రిక విఫలమైంది. నెదర్లాండ్స్‌ పటిష్టమైన బౌలింగ్ కారణంగా సౌతాఫ్రిక నిర్ణీత ఓవర్లలో 207 పరుగులు మాత్రమే చేసింది. దీంతో నెదర్లాండ్స్‌ 38 పరుగుల తేడాతో అనూహ్య విజయాన్నిఅందుకుంది. ఇక నెదర్లాండ్స్‌ బౌలింగ్ విషయానికొస్తే.. బాస్‌ డే లీడే, రోలోఫ్‌ వాన్‌ డెన్‌ మెర్వే, పాల్‌ వాన్‌ మీకెరెన్‌ చేరెసి రెండు వికెట్లను తీసుకున్నారు. అందరికంటే అధికంగా లోగాన్‌ వాన్‌ బీక్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక కోలిన్‌ అకెర్‌మాన్‌ ఒక వికెట్‌ను తీసుకున్నాడు.

ఇక అంతకు ముందు మొదట బ్యాటింగ్‌ చేసిన నెదర్లాండ్స్‌ 43 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 245 పరులు చేసింది. నెదర్లాండ్స్‌ కెప్టెన్ ఎడ్వర్డ్‌ 78 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు స్కోర్‌ పెరగడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మ్యాచ్‌ చివరిలో వాన్‌డెర్‌ మెర్వ్‌ 29, దత్‌ పరుగులు సాధించి జట్టు స్కోర్‌ పెంచారు. సౌతాఫ్రికా బౌలింగ్ విషయానికొస్తే.. బౌలర్స్‌లో లుంగి ఎంగిడి, మార్కో, జాన్సన్‌ కగిసో రబాడా తలో 2 వికెట్లు పడగాట్టారు. గెరాల్డ్‌ కొయేట్టజీ, కేశవ్‌ మహారాజ్‌ చెరో వికెట్‌ను పడగొట్టారు.

దక్షిణాఫ్రికా ప్లేయింగ్‌ 11 టీమ్‌..

క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్‌), తెంబా బావుమా (కెప్టెన్), వాండర్‌ డస్సెన్, ఐడెన్ మార్‌క్రమ్‌, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సన్‌, కగిసో రబాడ, కేశవ్ మహరాజ్, లుంగి ఎంగిడి, గెరాల్డ్ కోయెట్జీ

నెదర్లాండ్స్ ప్లేయింగ్‌ 11 టీమ్‌..

విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, బాస్ డి లీడే, తేజ నిడమనూరు, స్కాట్ ఎడ్వర్డ్స్(వికెట్‌ కీపర్‌, కెప్టెన్‌), సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్‌, పాల్ వాన్ మీకెరెన్

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..