VHT 2022: 18 ఫోర్లు, 6 సిక్సర్లతో భారీ ఇన్నింగ్స్.. చరిత్ర సృష్టించిన ధోనీ సహచరుడు.. చరిత్రలోనే తొలి ప్లేయర్..

|

Nov 30, 2022 | 4:16 PM

Ruturaj Gaikwad: విజయ్ హజారే ట్రోఫీలో 168 పరుగుల ఇన్నింగ్స్ ఆడి రితురాజ్ గైక్వాడ్ భారీ రికార్డు సృష్టించాడు. ఈ రికార్డుతో లిస్ట్ A చరిత్రలో గైక్వాడ్ మొదటి బ్యాట్స్‌మెన్ అయ్యాడు. ఈ ఫార్మాట్‌లో బ్యాటింగ్ సగటు 60 కంటే ఎక్కువగా నిలిచింది.

VHT 2022: 18 ఫోర్లు, 6 సిక్సర్లతో భారీ ఇన్నింగ్స్.. చరిత్ర సృష్టించిన ధోనీ సహచరుడు.. చరిత్రలోనే తొలి ప్లేయర్..
Ruturaj Gaikwad
Follow us on

విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ఫాంతో దూసుకపోతున్నాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో అతను 220 పరుగులు చేశాడు. అదే సమయంలో అస్సాంతో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో 168 పరుగులతో మెరుపు సెంచరీ చేశాడు. గైక్వాడ్ తన ఇన్నింగ్స్‌లో 18 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. ఈ ఇన్నింగ్స్‌తో తన పేరిట ఓ భారీ ప్రపంచ రికార్డు సృష్టించాడు.

చరిత్ర సృష్టించిన రితురాజ్ గైక్వాడ్..

విజయ్ హజారే ట్రోఫీలో 168 పరుగుల ఇన్నింగ్స్ ఆడి రితురాజ్ గైక్వాడ్ భారీ రికార్డు సృష్టించాడు. ఈ రికార్డుతో లిస్ట్ A చరిత్రలో గైక్వాడ్ మొదటి బ్యాట్స్‌మెన్ అయ్యాడు. ఈ ఫార్మాట్‌లో బ్యాటింగ్ సగటు 60 కంటే ఎక్కువగా నిలిచింది. మరోవైపు, విజయ్ హజార్ ట్రోఫీలో గైక్వాడ్ చివరి 9 ఇన్నింగ్స్‌లను పరిశీలిస్తే, అతను 7 సెంచరీలు సాధించాడు. ఇందులో డబుల్ సెంచరీ కూడా ఉంది.

క్వార్టర్ ఫైనల్స్‌లో ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు..

మహారాష్ట్ర ఓపెనర్ రితురాజ్ గైక్వాడ్ విజయ్ హజారే ట్రోఫీలో భారీ ఫీట్ చేశాడు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో గైక్వాడ్ ఒకే ఓవర్లో 7 సిక్సర్లు బాదాడు. అలా చేసిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. మ్యాచ్ 49వ ఓవర్లో అతడు ఈ ఘనత సాధించాడు. యూపీ బౌలర్ శివ సింగ్ బౌలింగ్‌లో గైక్వాడ్ 7 సిక్సర్లు బాదాడు.

ఇవి కూడా చదవండి

యూపీపై డబుల్ సెంచరీ..

విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో ఉత్తరప్రదేశ్‌పై రితురాజ్ గైక్వాడ్ డబుల్ సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్‌లో అతను 159 బంతుల్లో 220 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 10 ఫోర్లు, 16 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో అతను తన డబుల్ సెంచరీని చాలా ప్రత్యేకమైన రీతిలో పూర్తి చేశాడు. 49వ ఓవర్లో వరుసగా 7 సిక్సర్లు కొట్టడం ద్వారా తన డబుల్ సెంచరీని పూర్తి చేశాడు. అతను సెమీ-ఫైనల్స్‌లోనూ తన ఫామ్‌ను కొనసాగించాడు. అస్సాంపై 168 పరుగులతో సెంచరీ చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..