వామ్మో.. రూ. 23.84 కోట్ల టాక్స్ కట్టిన టీమిండియా ప్లేయర్.. ఎవరో తెలుసా..?

Highest Taxpayer Uttarakhand: క్రికెట్‌లో తన అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యంతో భారత్‌కు అనేక విజయాలు అందించిన పంత్, సమాజం పట్ల తన బాధ్యతను కూడా అంతే సమర్థవంతంగా నెరవేరుస్తున్నాడు. అత్యున్నత స్థాయిలో పన్ను చెల్లిస్తూ యువ క్రీడాకారులకు, దేశ పౌరులకు ఆదర్శంగా నిలవడం అభినందనీయం.

వామ్మో.. రూ. 23.84 కోట్ల టాక్స్ కట్టిన టీమిండియా ప్లేయర్.. ఎవరో తెలుసా..?
Rishabh Pant, Income Tax Uttarakhand

Updated on: Aug 10, 2026 | 10:48 AM

Rishabh Pant, Income Tax Uttarakhand: భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మైదానంలోనే కాదు, బయట కూడా తన సత్తా చాటుతున్నాడు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏకంగా రూ. 23.84 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా నిలిచి సరికొత్త రికార్డు సృష్టించాడు. భారత క్రికెట్ వికెట్ కీపర్, విధ్వంసకర బ్యాటర్ రిషభ్ పంత్ క్రికెట్ మైదానంలో ఎంత వేగంగా పరుగులు సాధిస్తాడో, పన్ను చెల్లింపుల్లో కూడా అంతే వేగంగా సరికొత్త అధ్యాయం లిఖిస్తున్నాడు. ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆదాయపు పన్ను శాఖ ఇటీవల నిర్వహించిన పన్ను దినోత్సవ వేడుకల్లో ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పంత్ ఏకంగా రూ. 23.84 కోట్ల పన్ను చెల్లించి, ఆ రాష్ట్రంలోనే అత్యధికంగా పన్ను చెల్లించిన వ్యక్తిగా అగ్రస్థానంలో నిలిచాడు. వరుసగా రెండో సంవత్సరం కూడా పంత్ ఈ ఘనత సాధించడం విశేషం.

గత ఏడాది కంటే రెట్టింపు పన్ను కట్టిన రిషభ్ పంత్..

గత ఆర్థిక సంవత్సరంలో పంత్ ముందస్తు పన్ను రూపంలో దాదాపు రూ. 10.5 కోట్లు చెల్లించాడు. అయితే ఈ సారి అతని ఆదాయం విపరీతంగా పెరగడంతో చెల్లించిన పన్ను మొత్తం కూడా రెట్టింపు కంటే ఎక్కువైంది. రూర్కీలో జన్మించిన ఈ డాషింగ్ బ్యాటర్ చిన్నప్పటి నుంచి కష్టపడి క్రికెట్ రంగంలో తనదైన ముద్ర వేశాడు. నేడు తన సొంత రాష్ట్రానికి అత్యధిక పన్ను చెల్లించే వ్యక్తిగా ఎదగడం పట్ల క్రీడాభిమానులు, ఉత్తరాఖండ్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఎక్కువమంది చదివింది: వరల్డ్ కప్ 2027 రేసు నుంచి ఆ 2 దిగ్గజ టీంలు ఔట్.. టీమిండియా పరిస్థితి ఏంటంటే?

ఇవి కూడా చదవండి

పంత్ ఆదాయానికి ప్రధాన మూలాలు ఇవే..

ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన పంత్, ఇప్పుడు కోట్లాది రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. ఐపీఎల్ వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం పంత్‌ను రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ వేతనంతో పాటు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్, మ్యాచ్ ఫీజులు, వివిధ బ్రాండ్ అంబాసిడర్ ప్రకటనల ద్వారా అతనికి భారీగా ఆదాయం సమకూరుతోంది. ఈ విభిన్న మార్గాల నుంచి వస్తున్న భారీ ఆదాయం కారణంగానే పంత్ ఇంత పెద్ద మొత్తంలో పన్ను చెల్లించగలిగాడు.

సొంత రాష్ట్రంతో పంత్‌కు విడదీయరాని అనుబంధం..

ప్రస్తుతం ఢిల్లీ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడుతున్నప్పటికీ, తన మూలాలు ఉన్న ఉత్తరాఖండ్‌ను పంత్ ఎన్నడూ మరచిపోలేదు. 2022లో ఆ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా నియమితుడయ్యాడు. భయంకరమైన కారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడి, తిరిగి టీమిండియాలోకి వచ్చి అద్భుత ప్రదర్శన చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. మైదానంలో తన ఆటతోనే కాకుండా, క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తూ నిజమైన బాధ్యతాయుత పౌరుడిగా నిలిచాడు.

ఎక్కువమంది చదివింది:  Video: దమ్ముంటే ఒక్క సిక్స్ కొట్టంటూ రెచ్చగొట్టిన పాక్ దిగ్గజం.. 4 వరుస బంతుల్లోనే నోర్మూయించిన సచిన్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us