Glenn Maxwell: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వెటరన్ బ్యాట్స్‌మెన్ గ్లెన్ మాక్స్‌వెల్ IPL 2024లో మెరుగైన ప్రదర్శన చేయడంలో విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. మంగళవారం కూడా లక్నో సూపర్ జెయింట్స్ (RCB vs LSG)తో జరిగిన మ్యాచ్‌లో ఖాతా తెరవకుండానే రెండో బంతికే ఔటయ్యాడు. దీంతో చెత్త రికార్డ్ కూడా అతని పేరిట నమోదైంది. గ్లెన్ మాక్స్‌వెల్ ఇప్పుడు ఐపీఎల్‌లో అత్యధికంగా ఔట్ అయిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
IPL 2024 15వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ ఆర్‌సీబీ హోమ్ గ్రౌండ్ అంటే చిన్నస్వామి గ్రౌండ్‌లో జరిగినప్పటికీ బెంగళూరు జట్టు మ్యాచ్‌ను గెలవలేకపోయింది. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 28 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును సులభంగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోరు చేయగా, ఆర్సీబీ 19.4 ఓవర్లలో 153 పరుగులకే పరిమితమైంది. మయాంక్ యాదవ్ మరోసారి అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టాడు. అతను వరుసగా రెండో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకుని సత్తా చాటాడు.
ఈ మ్యాచ్‌లో, గ్లెన్ మాక్స్‌వెల్ భారీ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు మ్యాచ్‌ను గెలుస్తాడని భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, మయాంక్ యాదవ్ పేస్ కారణంగా, మ్యాక్స్వెల్ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఐపీఎల్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ సున్నాతో ఔట్ కావడం ఇది 16వ సారి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డకౌట్‌లు చేసిన రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. ముంబై ఇండియన్స్ మాజీ సారథి రోహిత్ శర్మ 17 సార్లు పరుగులేమీ చేయకుండానే ఔటయ్యాడు. ఆర్సీబీకి చెందిన దినేష్ కార్తీక్ రెండో స్థానంలో ఉన్నాడు. అతను కూడా 17 సార్లు మాత్రమే సున్నా వద్ద ఔట్ అయ్యాడు. ఇప్పుడు గ్లెన్ మాక్స్‌వెల్ మూడో స్థానంలో నిలిచి, చెత్త రికార్డులో చేరాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), మయాంక్ డాగర్, రీస్ టోప్లీ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..