Team India : ప్రధానులు మారారు..కెప్లెన్లు మారారు..కానీ 13ఏళ్లుగా ఇండియాలో ఒక్క హాఫ్ సెంచరీ చేయని స్టార్ ప్లేయర్

Ravindra Jadeja : రవీంద్ర జడేజా చివరిసారిగా ఇండియాలో వన్డే హాఫ్ సెంచరీ సాధించింది జనవరి 15, 2013న. కొచ్చి వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో జడ్దూ కేవలం 37 బంతుల్లోనే 61 పరుగులు చేసి అదరగొట్టాడు. ఆ రోజుల్లో భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నారు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు

Team India : ప్రధానులు మారారు..కెప్లెన్లు మారారు..కానీ 13ఏళ్లుగా ఇండియాలో ఒక్క హాఫ్ సెంచరీ చేయని స్టార్ ప్లేయర్
Ravindra Jadeja

Updated on: Jan 17, 2026 | 7:54 AM

Team India : టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ప్రపంచంలోని బెస్ట్ ఆల్ రౌండర్లలో ఒకడిగా పేరున్న జడేజా, భారత గడ్డపై వన్డేల్లో హాఫ్ సెంచరీ సాధించి దాదాపు 13 ఏళ్లు కావస్తోంది. సర్ జడేజా హోమ్ గ్రౌండ్స్‌లో చివరిసారిగా 50 పరుగుల మార్కును దాటినప్పుడు మన దేశ పరిస్థితులు పూర్తిగా వేరుగా ఉన్నాయి. భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రస్తుతం 1-1 తో సమానంగా ఉంది. నిర్ణయాత్మకమైన మూడో వన్డే ఈరోజు (జనవరి 18, 2026) ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయంపై ఎంత కన్నుందో, జడేజా తన హోమ్ డ్రైని ముగిస్తాడా లేదా అనే దానిపై కూడా అంతే ఆసక్తి నెలకొంది.

రవీంద్ర జడేజా చివరిసారిగా ఇండియాలో వన్డే హాఫ్ సెంచరీ సాధించింది జనవరి 15, 2013న. కొచ్చి వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో జడ్దూ కేవలం 37 బంతుల్లోనే 61 పరుగులు చేసి అదరగొట్టాడు. ఆ రోజుల్లో భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నారు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు (అప్పుడు ఆయన అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నారు). టీమిండియాకు మూడు ఫార్మాట్లలో ఎంఎస్ ధోనీనే కెప్టెన్. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ అప్పటికి ఇంకా వన్డేల్లో ఓపెనర్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టలేదు.

జడేజా కెరీర్ గణాంకాలు చూస్తే ఒక విచిత్రమైన విషయం కనిపిస్తుంది. ఆయన తన కెరీర్‌లో సాధించిన 13 అర్థ సెంచరీలలో కేవలం 2 మాత్రమే భారత గడ్డపై వచ్చాయి. మిగిలిన 11 హాఫ్ సెంచరీలు విదేశీ పిచ్‌లపైనే సాధించాడు. భారత్‌లో ఆయన వన్డే సగటు 30.75 కాగా, విదేశాల్లో ఇది చాలా మెరుగ్గా ఉంది. గతేడాది ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన జడేజా, ఇప్పుడు స్వదేశీ వన్డేల్లో తన బ్యాటింగ్ ఫామ్‌ను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..