
Ranji Trophy 2026 : రాజ్‌కోట్ వేదికగా పంజాబ్, సౌరాష్ట్ర జట్ల మధ్య జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీమిండియా వెటరన్ ప్లేయర్ రవీంద్ర జడేజా ఈ మ్యాచ్‌లో సౌరాష్ట్రను ఆదుకుంటాడని అందరూ ఆశించారు. కానీ నంబర్ 5 పొజిషన్లో బ్యాటింగ్‌కు వచ్చిన జడేజా కేవలం 6 బంతులు మాత్రమే ఎదుర్కొని, 7 పరుగులు చేసి జస్ ఇందర్ బౌలింగ్‌లో అనవసర షాట్ ఆడి అవుట్ అయ్యాడు. జడేజా వైఫల్యంతో పాటు మిగిలిన బ్యాటర్లు కూడా చేతులెత్తేయడంతో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 47.1 ఓవర్లలో 172 పరుగులకే కుప్పకూలింది.
ఈ మ్యాచ్‌లో అసలైన హీరోగా నిలిచాడు పంజాబ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్. తన బౌలింగ్‌తో సౌరాష్ట్ర బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేసిన బ్రార్, కేవలం 38 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. పిచ్‌పై ఉన్న పట్టును సరిగ్గా వాడుకుంటూ ప్రేరక్ మన్కడ్, హార్విక్ దేశాయ్ వంటి కీలక వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. బ్రార్ వేసిన బంతుల్లో సుమారు 80 శాతం డాట్ బాల్స్ ఉండటం గమనార్హం. అంటే అతను కేవలం వికెట్లు తీయడమే కాదు, పరుగులను కూడా కట్టడి చేసి బ్యాటర్లపై తీవ్ర ఒత్తిడి పెంచాడు.
హర్‌ప్రీత్ బ్రార్ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఒక పెద్ద పోరాటమే ఉంది. పంజాబ్ రణజీ జట్టులోకి ప్రవేశించడానికి అతను ఏకంగా ఏడుసార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. ప్రతిసారీ సెలక్టర్లు అతడిని తిరస్కరించినా పట్టువదలక కష్టపడి, ఇప్పుడు అదే జట్టుకు ప్రధాన స్పిన్నర్‌గా మారాడు. ఇది అతని కెరీర్‌లో మూడవ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ మాత్రమే కావడం విశేషం. కేవలం 4 ఇన్నింగ్స్‌లలోనే బ్రార్ 14 వికెట్లు తీసి తన సత్తా చాటాడు. ఇది అతనికి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మొదటి ‘ఫైవ్ వికెట్ హాల్’ కావడం మరో విశేషం.
నిజానికి బ్రార్‌ను అందరూ టీ20 స్పెషలిస్ట్ అని పిలుస్తారు. ఐపీఎల్‌లో కూడా అతను అద్భుతమైన ప్రదర్శన చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పటివరకు 102 టీ20 మ్యాచ్‌ల్లో 102 వికెట్లు తీసిన రికార్డు అతనికుంది. అయితే, ఇప్పుడు రెడ్ బాల్ తో కూడా తాను సమర్థుడనని నిరూపించుకున్నాడు. మరోవైపు టీమిండియా కీలక మ్యాచులకు ముందు జడేజా ఇలా ఫామ్ కోల్పోవడం సౌరాష్ట్రతో పాటు అభిమానులను కూడా కలవరపెడుతోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..