IPl 2022: వరుసగా మూడో విజయాన్ని సొంతం చేసుకున్న హైదరాబాద్.. ఏడు వికెట్ల తేడాతో కోల్‌కత్తాపై గెలుపు..

|

Apr 15, 2022 | 11:23 PM

SRH vs KKR: ఐపీఎల్‌ 2022(IPL 2022)లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌(SRH), కోల్‌కత్తా నైట్‌రైడర్స్(KKR) మధ్య జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

IPl 2022: వరుసగా మూడో విజయాన్ని సొంతం చేసుకున్న హైదరాబాద్.. ఏడు వికెట్ల తేడాతో కోల్‌కత్తాపై గెలుపు..
Srh
Follow us on

ఐపీఎల్‌ 2022(IPL 2022)లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌(SRH), కోల్‌కత్తా నైట్‌రైడర్స్(KKR) మధ్య జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిం 175 పరుగులు చేసింది. కోల్‌కత్తా మొదట్లో వరుస వికెట్లు కోల్పోయి కాస్త కష్టాల్లోకి వెళ్లినట్లు కనిపించింది. 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఆ జట్టును కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నితిష్ రానా ఆదుకున్నారు. 25 బంతుల్లో 28 పరుగులు చేసిన శ్రేయస్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన జక్సన్‌ 7 పరుగులకే పెవిలియన్ చేరగా.. రసెల్‌తో కలిసి నితిష్ రానా ఇన్సింగ్స్ ముందుకు తీసుకెళ్లాడ.

ఈ క్రమంలో 36 బంతుల్లో 54(6 ఫోర్లు, 2 సిక్స్‌) పరుగులు చేసిన రానా నటరాజన్ బౌలింగ్ కీపర్‌కు చిక్కాడు. ఆ తర్వాత కోల్‌కత్తా క్రమంగా వికెట్లు కోల్పోతున్నా.. రసెల్‌ మాత్రం దాటిగా ఆడాడు. అండ్రూ రసెల్‌ 25 బంతుల్లో 49(4 ఫోర్లు, 4 సిక్స్‌లు) పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వెంకటేష్ అయ్యర్ 6, ఫించ్ 7, నరైన్‌ 6, కమ్మిన్స్ 3, హకిమ్ ఖాన్ 5, ఉమేష్‌ యాదవ్ 1 పరుగు చేసి నాటౌట్‌గా నిలిచాడు. హైదరాబాద్‌ బౌలర్లలో నటరాజన్ మూడు వికెట్లు పడగొట్టగా ఉమ్రాన్‌ మాలిక్ 2, భువనేశ్వర్, జాన్‌సేన్, సుచిత్ ఒక్కో వికెట్ తీశారు.

176 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌ మొదలు పెట్టిన హైదరాబాద్ రెండో ఓవర్‌లోనే మొదటి వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన అభిషేక్ శర్మ కమ్మిన్స్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ విలియమ్సన్, త్రిపాఠితో కలిసి ఇన్నింగ్స్ ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ అతను రసెల్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. విలియమ్సన్ 16 బంతుల్లో 17 పరుగులు చేశాడు. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి, మర్‌క్రమ్‌తో కలిసి ఇన్నింగ్స్ ముందుకు నడిపించారు. ఈ క్రమంలో రాహుల్ త్రిపాఠి హాఫ్ సెంచరీ చేశాడు. 37 బంతుల్లో 71(4 ఫోర్లు, 6 సిక్స్‌) పరుగులు చేసి ఔటయ్యాడు.

ఆ తర్వాత మర్‌క్రమ్‌ పూరన్‌తో కలిసి జట్టును ఆదుకున్నాడు. 36 బంతుల్లో 68(6 ఫోర్లు, నాలుగు సిక్స్)పరుగులు చేసి జట్టును గెలిపించాడు. పూరన్‌ 5 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కోల్‌కత్తా బౌలర్లలో రసెల్‌ 2 వికెట్లు, కమ్మిన్స్‌ ఒక వికెట్ పడగొట్టారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐదు మ్యాచ్‌ల్లో మూడింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది.

Read Also.. DC vs RCB IPL 2022 Match Prediction: ఢిల్లీతో ఢీ అంటోన్న బెంగళూరు.. గత రికార్డులు ఏం చెబుతున్నాయంటే..