
Praful Hinge India A: విదర్భకు చెందిన 24 ఏళ్ల పేసర్ ప్రఫుల్ హింగేకు బీసీసీఐ నుంచి కీలక అవకాశం వచ్చింది. ఆస్ట్రేలియా ఏతో పుదుచ్చేరిలో జరగనున్న రెండు మల్టీ డే మ్యాచ్‌ల కోసం ప్రకటించిన ఇండియా ఏ స్వ్కాడ్ (India A squad)లో అతడిని తొలిసారి ఎంపిక చేశారు. ఐపీఎల్ (IPL 2026)లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) తరపున అరంగేట్రం చేసిన హింగే.. రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)పై ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. ఆ ఓవర్ తొలి బంతికే వైభవ్ సూర్యవంశీని ఔట్ చేశాడు. మ్యాచ్‌లో 34 పరుగులకు నాలుగు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ (Player of the Match) గా నిలిచాడు.
ఐపీఎల్ 2026 (IPL 2026) లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)తో మ్యాచ్ ద్వారా సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) తరపున ప్రఫుల్ హింగే టీ20 లీగ్‌లోకి అడుగుపెట్టాడు. అప్పటివరకు దేశవాళీ క్రికెట్‌ను అనుసరించే కొద్దిమందికే తెలిసిన ఈ పేసర్.. అరంగేట్ర మ్యాచ్‌తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు.
రెండో ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే హింగే మూడు వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో మూడు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ఆ ఓవర్ మొదటి బంతికే వైభవ్ సూర్యవంశీని పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత ధ్రువ్ జురెల్, లువాన్-డ్రే ప్రిటోరియస్‌లను కూడా అదే ఓవర్‌లో ఔట్ చేశాడు.
ఆ మ్యాచ్‌లో హింగే 34 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు సాధించాడు. ఈ అద్భుత ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఐపీఎల్ అరంగేట్రం తర్వాత కూడా అతని బౌలింగ్‌లో జోరు కొనసాగింది.
ఎక్కువమంది చదివినది: బీబీఎల్‌లో హిస్టరీలోనే రికార్డ్ డీల్.. ఐపీఎల్ తోపుగాడిపై కోట్ల వర్షం..!
మూడు ఫార్మాట్లను కలిపి కేవలం 1,995 బంతుల్లో హింగే 47 వికెట్లు సాధించాడు. 10 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 19 ఇన్నింగ్స్ బౌలింగ్ చేసి 1,515 బంతుల్లో 27 వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్ యావరేజ్ 26.66గా ఉంది. లిస్ట్ ఏలో ఆరు ఇన్నింగ్స్ ల్లో 300 బంతులు వేసి ఐదు వికెట్లు తీశాడు. T20ల్లో ఎనిమిది ఇన్నింగ్స్ ల్లో 15 వికెట్లు సాధించాడు.
ఐపీఎల్ తర్వాత హింగే విదర్భ ప్రో టీ20 లీగ్ (Vidarbha Pro T20 League)లో ఆడి ఎనిమిది వికెట్లు తీశాడు. అనంతరం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ (BCCI Centre of Excellence)లో జరిగిన అండర్ 25 ఎమర్జింగ్ (Under-25 Emerging) మ్యాచ్‌లకు అతడిని పిలిచారు. ఈ ప్రదర్శనల తర్వాత ఇప్పుడు ఇండియా ఏ (India A) జట్టులో చోటు దక్కింది.
దేవదుత్ పడిక్కల్ (Devdutt Padikkal) నాయకత్వంలో ఇండియా ఏ (India A).. ఆస్ట్రేలియా ఏ (Australia A)తో పుదుచ్చేరిలో రెండు మల్టీ డే మ్యాచ్‌లు ఆడనుంది. ఈ స్థాయిలో తొలిసారి అవకాశం అందుకున్న హింగేకు ఇది తన ప్రతిభను మరోసారి నిరూపించుకునే వేదికగా మారనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..