
India Women vs Pakistan Women, 6th Match: వరుసగా నాలుగో ఆదివారం, భారత్ vs పాకిస్తాన్ జట్లు క్రికెట్ మైదానంలో తలపడనున్నాయి. సెప్టెంబర్ 14, 21, 28 తేదీల్లో జరిగిన ఆసియా కప్‌లో రెండు దేశాల పురుషుల జట్లు తలపడ్డాయి. భారత జట్టు మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి, తొమ్మిదోసారి ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది.
పురుషుల మ్యాచ్ తర్వాత, ఇప్పుడు మహిళల వంతు వచ్చింది. నేడు, మహిళల వన్డే ప్రపంచ కప్ లీగ్ రౌండ్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ శ్రీలంకలోని కొలంబోలో జరుగుతోంది. ఈ మేరకు టాస్ గెలిచిన పాక్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు బ్యాటింగ్ చేయనుంది.
ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు రెండు జట్లు చెరొక మ్యాచ్ ఆడాయి. భారత్ తన ప్రారంభ మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించగా, పాకిస్తాన్ బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది.
భారత మహిళలు (ప్లేయింగ్ XI): ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్(కీపర్), స్నేహ రాణా, రేణుకా సింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి.
పాకిస్థాన్ మహిళలు (ప్లేయింగ్ XI): మునీబా అలీ, సదాఫ్ షమాస్, సిద్రా అమీన్, రమీన్ షమీ, అలియా రియాజ్, సిద్రా నవాజ్(కీపర్), ఫాతిమా సనా(కెప్టెన్), నటాలియా పర్వైజ్, డయానా బేగ్, నష్రా సంధు, సాదియా ఇక్బాల్.