ODI World Cup 2023: తొలి వార్మప్ మ్యాచ్‌లో బంగ్లా విజయం.. లంకపై అర్థ సెంచరీలతో రాణించిన టాప్ ఆర్డర్ బ్యాటర్లు..

|

Sep 29, 2023 | 10:05 PM

BAN vs SL, ODI World Cup 2023: అంతకముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 263 పరుగులకు ఆలౌట్ అయింది. లంక తరఫున ఓపెనర్లు పతుమ్ నిసంక 68, కుశల్ పెరేరా 34 చేయగా.. చివర్లో వచ్చిన ధనంజయ డి సిల్వా అర్థ సెంచరీతో రాణించాడు. ఈ క్రమంలో బంగ్లా బౌలర్లలో..

ODI World Cup 2023: తొలి వార్మప్ మ్యాచ్‌లో బంగ్లా విజయం.. లంకపై అర్థ సెంచరీలతో రాణించిన టాప్ ఆర్డర్ బ్యాటర్లు..
BAN-vs-SL
Follow us on

BAN vs SL, ODI World Cup 2023: వరల్డ్ కప్ ప్రారంభానికి ముందుగా శుక్రవారం జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో శ్రీలంకపై బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ తరఫున ఓపెనర్లుగా వచ్చిన తంజిద్ హాసన్(84), లిటన్ దాస్(61) అర్థసెంచరీలు చేయడంతో పాటు జట్టుకు శుభారంభం అందించారు. ఆ తర్వాత క్రీజులోని వచ్చిన కెప్టెన్ మెహిదీ హాసన్ మిరాజ్(67) కూడా అజేయమైన అర్థ సెంచరీ, ముష్ఫికర్ రహిమ్ 35* రన్స్ చేయడంతో లంక విధించిన 264 పరుగుల లక్ష్యాన్ని 42 ఓవర్లలోనే సునాయాసంగా చేధించింది బంగ్లాదేశ్. ఇక లంక బౌలర్లలో లాహిరు కుమార, దునిత్ వెల్లలాగే చెరో వికెట్ తీసుకున్నారు.

అంతకముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 263 పరుగులకు ఆలౌట్ అయింది. లంక తరఫున ఓపెనర్లు పతుమ్ నిసంక 68, కుశల్ పెరేరా 34 చేయగా.. చివర్లో వచ్చిన ధనంజయ డి సిల్వా (55) అర్థ సెంచరీతో రాణించాడు. ఈ క్రమంలో బంగ్లా బౌలర్లలో మెహిదీ హాసన్ 3 వికెట్లు తీసుకోగా.. మెహిదీ హాసన్ మిరాజ్, తంజిమ్ హాసన్ సకిబ్, షోరిఫుల్ ఇస్లాం, నసుమ్ అహ్మద్ తలో వికెట్ తీసుకున్నారు.

తొలి వార్మప్ మ్యాచ్‌కి ఇరు జట్లు:

శ్రీలంక జట్టు: దసున్ షనక (కెప్టెన్), కుసల్ మెండిస్ (వైస్ కెప్టెన్), కుసల్ పెరీరా, పాతుమ్ నిస్సాంక, లహిరు కుమార్, దిముత్ కరుణరత్నే, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, మహేశ్ తీక్షన్, దునిత్ వెల్లలఘే, కసున్ పతీర్‌నా, మధుశంక, దుషన్ హేమంత.

బంగ్లాదేశ్ జట్టు: షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిట్టన్ దాస్, తాంజిద్ హసన్ తమీమ్, నజ్ముల్ హొస్సేన్ శాంటో (విసి), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా రియాద్, మెహిదీ హసన్ మిరాజ్, నసుమ్ అహ్మద్, షాక్ మెహదీ హసన్, తస్కిన్ ఎ మహ్సన్, తస్కిన్ ఎ. షోరిఫుల్ ఇస్లాం, తంజిమ్ హసన్ సాకిబ్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..