IPL 2023 Auction: వరల్డ్‌కప్‌లో తుస్సుమనిపించాడు.. కట్ చేస్తే.. మినీ వేలంలో జాక్‌పాట్ కొట్టాడు..

Nicholas Pooran Auction Price: సన్‌రైజర్స్ మాజీ ఆటగాడు నికోలస్ పూరన్‌కు మినీ వేలంలో జాక్‌పాట్ లభించింది. ఈ ప్లేయర్ కోసం ముందు నుంచి రాయల్స్, చెన్నై పోటీపడగా..

IPL 2023 Auction: వరల్డ్‌కప్‌లో తుస్సుమనిపించాడు.. కట్ చేస్తే.. మినీ వేలంలో జాక్‌పాట్ కొట్టాడు..
Nicholas Pooran

Updated on: Dec 23, 2022 | 4:16 PM

Nicholas Pooran Auction Price: సన్‌రైజర్స్ మాజీ ఆటగాడు నికోలస్ పూరన్‌కు మినీ వేలంలో జాక్‌పాట్ లభించింది. ఈ ప్లేయర్ కోసం ముందు నుంచి రాయల్స్, చెన్నై పోటీపడగా.. అనూహ్యంగా బిడ్‌లో ఢిల్లీ వచ్చి.. అతడి ధరను అమాంతం పెంచేసింది. రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పూరన్ ధరను రూ. 5 కోట్లపైకి తీసుకెళ్లాయి. చివరికి అతడ్ని రూ. 16 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది.

ఇదిలా ఉంటే.. ఈ ఏడాది సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన నికోలస్ పూరన్ అత్యంత పేలవ ఫామ్‌ను కనబరిచాడు. జట్టుకు ఒక్క విజయంలో కూడా ఉపయోగపడలేదు. దీంతో మినీ వేలానికి ముందుగా అతడ్ని సన్‌రైజర్స్ వదులుకుంది. ఇక ఆ తర్వాత జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన నికోలస్ పూరన్ అక్కడ కూడా తుస్సుమనిపించాడు. ఫలితం విండీస్ గ్రూప్ స్టేజిలోనే ఇంటి ముఖం పట్టింది.

అయితే రీసెంట్‌గా జరిగిన టీ10 లీగ్‌లో డెక్కన్ గ్లాడియేటర్స్‌కు సారధ్యం వహించిన పూరన్ అద్భుత ఫామ్ కనబరిచాడు. తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఆ ఆటతీరుతో ఇతడ్ని వేలంలో కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు సుముఖం వ్యక్తం చేశాయి. ఢిల్లీ, చెన్నై, రాయల్స్, లక్నో పోటీపడి.. చివరికి రూ. 16 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్‌ను నికోలస్ పూరన్ దక్కించుకుంది. కాగా, 2022 మెగా ఆక్షన్‌లో పూరన్‌ను రూ. 10 కోట్లకు హైదరాబాద్ దక్కించుకున్న విషయం విదితమే.