Video: 9 సిక్సర్లు, 7 ఫోర్లు.. 225.58 స్ట్రైక్ రేట్‌‌తో సునామీ.. 43 బంతుల్లో కావ్యపాప మాజీ ప్లేయర్ బీభత్సం..

|

Sep 01, 2024 | 9:53 AM

Nicholas Pooran: నికోలస్ పూరన్ తన మూడవ T20 సెంచరీని 3 పరుగుల తేడాతో కోల్పోయాడు. అతను తన ఇన్నింగ్స్‌లో 43 బంతుల్లో కొట్టిన సిక్సర్ల సంఖ్యతో క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. నికోలస్ పూరన్ బ్యాట్‌తో విజృంభించిన ప్రభావంతో ఆ జట్టు సీపీఎల్ చరిత్రలో మూడో అతిపెద్ద స్కోరు కూడా చేసింది.

Video: 9 సిక్సర్లు, 7 ఫోర్లు.. 225.58 స్ట్రైక్ రేట్‌‌తో సునామీ.. 43 బంతుల్లో కావ్యపాప మాజీ ప్లేయర్ బీభత్సం..
Nicholas Pooran
Follow us on

Nicholas Pooran: నికోలస్ పూరన్ సిక్సర్లు కొట్టడంలో నిపుణుడు. కాబట్టే ప్రపంచ క్రికెట్‌లో ఫేమస్ అయ్యాడు. అతను తన తుఫాన్ ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థులకు గుండెదడ పుట్టిస్తుంటాడు. ఈ సామర్థ్యాల కారణంగా, నికోలస్ పూరన్ బౌలర్లకు పీడకలలా మారుతుంటాడు. తాజాగా CPL 2024లో ఆగస్ట్ 31న నికోలస్ పూరన్ బ్యాట్ నుంచి సిక్సర్ల వర్షం కురిసింది. అతను ఒంటరిగా సిక్సర్ల వర్షంతో బీభత్సం నెలకొల్పాడు. మిగిలిన జట్టు బ్యాట్స్‌మెన్‌లు కలిసి వాటిని కూడా స్కోర్ చేయలేకపోయాడు. తద్వారా అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. అంతేకాకుండా, అతని జట్టు CPL చరిత్రలో మూడవ అతిపెద్ద స్కోరు కూడా చేసింది.

CPL 2024 మూడో మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ సెయింట్ కిట్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ మొదట బ్యాటింగ్ చేయగా, నికోలస్ పూరన్ ఆడాడు. ఓపెనింగ్ జోడీ సునీల్ నరైన్, జాసన్ రాయ్ 4 ఓవర్లలో 44 పరుగులు జోడించారు. ఈ 44 పరుగుల్లో సునీల్ నరైన్ ఒక్కడే 19 బంతుల్లో 4 సిక్సర్లు, 3 ఫోర్లతో 38 పరుగులు చేశాడు. సునీల్ నరైన్ ఔట్ అయ్యాక, నికోలస్ పూరన్ మైదానంలోకి వచ్చాడు. ఆ తర్వాత దృశ్యం మరింత భయానకంగా మారింది.

43 బంతులు, 9 సిక్సర్లు, 97 పరుగులు..

నికోలస్ పూరన్ క్రీజులోకి వచ్చిన వెంటనే సెయింట్ కింట్స్ బౌలర్లను ధ్వంసం చేయడం ప్రారంభించాడు. మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. మరో ఎండ్‌ నుంచి జాసన్‌, ప్యారిస్‌ వికెట్లు పడగొట్టినా సెయింట్‌ కిట్స్‌ నికోలస్‌ పూరన్‌ బ్యాట్‌ను అదుపు చేయలేకపోయింది. బౌలర్లను చీల్చి చెండాడాడు. ఫలితంగా కేవలం 43 బంతుల్లో 9 సిక్సర్లు, 7 ఫోర్లతో 225.58 స్ట్రైక్ రేట్‌తో 97 పరుగులు వచ్చాయి.

క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టిన నికోలస్ పూరన్..

నికోలస్ పూరన్ తన మూడవ T20 సెంచరీని కేవలం 3 పరుగుల తేడాతో కోల్పోయాడు. అయితే, అతను క్రిస్ గేల్ భారీ రికార్డును బద్దలు కొట్టడంలో ఖచ్చితంగా విజయం సాధించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ రికార్డును పురాణ్ బద్దలు కొట్టాడు. 2015లో క్రిస్ గేల్ 135 సిక్సర్లు కొట్టాడు. నికోలస్ పూరన్ 2024లో ఇప్పటివరకు 139 సిక్సర్లు కొట్టాడు.

సీపీఎల్ చరిత్రలో మూడో అత్యధిక స్కోరు..

కేసీ కార్తీతో కలిసి నికోలస్ పూరన్ నాలుగో వికెట్‌కు 59 బంతుల్లో 122 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 27 ఏళ్ల కాస్సీ కార్తీ 35 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయంగా 73 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్‌లో వీరిద్దరి మధ్య జరిగిన అతిపెద్ద భాగస్వామ్యం ఫలితంగా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ CPL చరిత్రలో మూడవ అత్యధిక స్కోరును నమోదు చేసింది. సెయింట్ కిట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 250 పరుగులు చేసింది. సీపీఎల్ చరిత్రలో అత్యధికంగా 267 పరుగులు చేసిన రికార్డు కూడా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ పేరిట ఉంది. జమైకా తలైవాస్ 255 పరుగులతో రెండో భారీ స్కోరు చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..