IPL 2026: ముస్తాఫిజుర్ ఐపీఎల్ రీ-ఎంట్రీ.. బీసీసీఐ యూ-టర్న్? క్లారిటీ ఇచ్చిన బంగ్లాదేశ్ బోర్డు ప్రెసిడెంట్.!

IPL 2026: ఒకవైపు రాజకీయ కారణాలు, మరోవైపు ముస్తాఫిజుర్ ఐపీఎల్ ఉదంతం.. వెరసి భారత్-బంగ్లాదేశ్ క్రికెట్ స్నేహం ఇప్పుడు క్లిష్ట దశలో ఉంది. బీసీసీఐ దీనిపై అధికారికంగా స్పందిస్తేనే ఈ సస్పెన్స్‌కు తెరపడే అవకాశం ఉంది. తాజాగా వస్తోన్న వార్తలపై బీసీబీ క్లారిటీ ఇచ్చింది. అదేంటో తెలుసుకుందాం..

IPL 2026: ముస్తాఫిజుర్ ఐపీఎల్ రీ-ఎంట్రీ.. బీసీసీఐ యూ-టర్న్? క్లారిటీ ఇచ్చిన బంగ్లాదేశ్ బోర్డు ప్రెసిడెంట్.!
Mustafizur Rahman

Updated on: Jan 09, 2026 | 2:00 PM

IPL 2026: బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ఐపీఎల్ 2026 నుండి తప్పుకోవడం ఇప్పుడు రెండు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య పెను దుమారాన్ని రేపుతోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) నుంచి ముస్తాఫిజుర్ విడుదలైన తర్వాత, అతనిని మళ్ళీ లీగ్‌లోకి తీసుకువచ్చేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ పుకార్లపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం బుల్బుల్ స్పష్టతనిచ్చారు.

వివాదానికి మూలం ఏమిటి?

గత నెలలో జరిగిన ఐపీఎల్ వేలంలో ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ సుమారు రూ. 9.20 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, అనూహ్యంగా అతడిని జట్టు నుంచి విడుదల చేయడం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఆగ్రహం తెప్పించింది. ఈ నిర్ణయం వెనుక బీసీసీఐ అగ్రనాయకత్వం ప్రమేయం ఉందని వార్తలు రావడంతో వివాదం ముదిరింది.

బీసీసీఐ యూ-టర్న్ తీసుకుందా?

ముస్తాఫిజుర్ విడుదల తర్వాత భారత్-బంగ్లాదేశ్ క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో, వివాదాన్ని సద్దుమణిగేలా చేయడానికి బీసీసీఐ మళ్ళీ ముస్తాఫిజుర్‌కు ఐపీఎల్ ఆఫర్ ఇచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన బిసిబి అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం బుల్బుల్.. “ముస్తాఫిజుర్ పునరాగమనం గురించి బీసీసీఐ నుంచి మాకు ఎటువంటి లిఖితపూర్వక లేదా మౌఖిక సమాచారం రాలేదు. ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు” అని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: టీ20ల్లో విధ్వంసం అంటే ఇదే.. 38 సిక్సర్లు, 53 ఫోర్లు.. 549 పరుగులతో అన్ బ్రేకబుల్ రికార్డ్..

ప్రమాదంలో క్రికెట్ సంబంధాలు: ముస్తాఫిజుర్ వ్యవహారంతో బంగ్లాదేశ్ బోర్డు కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది:

బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించింది.

ఫిబ్రవరిలో భారత్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌కు జట్టును పంపేందుకు విముఖత వ్యక్తం చేస్తోంది.

భద్రతా కారణాల దృష్ట్యా తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని డిమాండ్ చేస్తోంది.

Video: 38 ఇన్నింగ్స్‌ల్లో 13 సెంచరీలు, 13 ఫిఫ్టీలు.. ఈ విధ్వంసం కనిపిస్తలేదా గంభీర్.. అరంగేట్రం ఛాన్స్ ఇంకెప్పుడు?

తమీమ్ ఇక్బాల్ సూచన: ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ స్పందించారు. కేవలం ప్రజల భావోద్వేగాలకు లోబడి నిర్ణయాలు తీసుకోవద్దని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని బోర్డుకు సూచించారు. వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలను బహిష్కరిస్తే అది రాబోయే పదేళ్ల బంగ్లాదేశ్ క్రికెట్ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..