
ముంబైకి చెందిన యువ క్రికెటర్, భారత టెస్ట్ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ ఇంగ్లాండ్‌లో పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. అతను ముంబై ఎమర్జింగ్ జట్టుతో ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నాడు. మొదటి రెండు మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించిన ముషీర్ ఖాన్, మూడవ మ్యాచ్‌లో హ్యాట్రిక్ సెంచరీలు పూర్తి చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లు అతని బ్యాటింగ్ ముందు నిస్సహాయంగా కనిపిస్తున్నారు. ఇది కాకుండా అతను బౌలింగ్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. గత సంవత్సరం కారు ప్రమాదంలో మెడకు తీవ్రమైన గాయం అయిన తర్వాత ముషీర్ రెడ్ బాల్ క్రికెట్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు అతను ఇంగ్లాండ్‌లో విధ్వంసం సృష్టిస్తున్నాడు.
మొదటి రెండు మ్యాచ్‌ల్లో అద్భుతమైన సెంచరీలు సాధించిన ముషీర్ ఖాన్, మూడవ మ్యాచ్‌లో కూడా అద్భుతమైన సెంచరీ సాధించాడు. లౌబరో UCCE జట్టుపై 116 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్సర్ సహాయంతో 102 పరుగులు చేశాడు. 87.93 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. జూలై 3న, ఛాలెంజర్స్ (కంబైన్డ్ నేషనల్ కౌంటీస్) జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ముషీర్ సెంచరీ సాధించి 10 వికెట్లు పడగొట్టాడు.
ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 127 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్‌తో 125 పరుగులు చేసిన అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీనితో పాటు ఛాలెంజర్స్ తొలి ఇన్నింగ్స్‌లో 38 పరుగులకు ఆరు వికెట్లు పడగొట్టగా, రెండో ఇన్నింగ్స్‌లో 56 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి మ్యాచ్‌లోనూ ముషీర్ ఖాన్ సెంచరీ సాధించాడు.
First match – Hundred.
Second match – Hundred.
Third match – Hundred.THIRD CONSECUTIVE HUNDRED FOR MUSHEER KHAN IN THE ENGLAND TOUR FOR MUMBAI EMERGING TEAM. 🇮🇳
The Future Star of Indian Cricket. pic.twitter.com/CVpo7EcoFV
— Johns. (@CricCrazyJohns) July 7, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి